For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఈ దరిద్రపు బౌలింగ్‌తో కప్ కొట్టేద్దామనే: ఆశకు హద్దు ఉండాలమ్మా

Irfan Pathan: ఐపీఎల్ 2024 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఓటమిని చవి చూసింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత నైట్‌రైడర్స్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో మట్టికరిచింది. హోమ్ పిచ్‌పై 182 పరుగుల భారీ స్కోర్‌ను చేసినా గానీ దాన్ని కాపాడుకోలేకపోయింది.

ఆర్సీబీ ఈ మ్యాచ్ ఓడిపోవడానికి ప్రధాన కారణం బౌలర్లు. నాసిరకం బౌలింగ్ చేశారు పైగా తమ సొంత గడ్డపై. హోమ్ పిచ్‌పై చేయదగ్గ బౌలింగ్ కాదది. ఒక్కరు కూడా కోల్‌కత బ్యాటర్లను భయపెట్టలేకపోయారు. వారిని ఒత్తిడిలోకి నెట్టలేకపోయారు. ఒక్క విజయ్‌కుమార్ వైశాఖ్ మాత్రమే నైట్‌ రైడర్లను అదుపులో ఉంచగలిగాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 23 పరుగులే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.

IPL 2024 RCB vs KKR Irfan Pathan and Michael Vaughan slams Royal Challengers bowling

ఐపీఎల్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన మహ్మద్ సిరాజ్.. ఈ మ్యాచ్‌లో కూడా తేలిపోయాడు. ధారాళంగా పరుగులను సమర్పించుకున్నాడు. మూడు ఓవర్లల్లో ఏకంగా 46 పరుగులను పిండుకున్నారు నైట్ రైడర్స్ బ్యాటర్లు. ఇందులో ఒక ఫోర్, అయిదు సిక్సులు ఉన్నాయి. సిరాజ్ బౌలింగ్‌లోనే అత్యధికంగా అయిదు సిక్సులు కొట్టారు బ్యాటర్లు.

అల్జారీ జోసెఫ్, యాష్ దయాళ్.. ఘోరంగా విఫలం అయ్యారు. జోసెఫ్ ఇచ్చిన పరుగులు 34. అదికూడా రెండంటే రెండు ఓవర్లల్లోనే. మహ్మద్ సిరాజ్, అల్జారీ జోసెఫ్ ఇద్దరూ కలిసి అయిదు ఓవర్లల్లో 80 పరుగులు ఇచ్చుకున్నారంటే వారి బౌలింగ్ నాణ్యత ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. యాష్ పరిస్థితీ అంతే. నాలుగు ఓవర్లల్లో 46 పరుగులు ఇచ్చినా కంటి తుడుపుగా ఓ వికెట్ పడగొట్టాడు.

ఆర్సీబీ బౌలింగ్ వ్యవహారం.. దుమారం రేపుతోంది. బౌలర్ల దెబ్బకు ఈ జట్టుపై విమర్శల సునామీలో చిక్కుకుంది. లెజెండరీ ప్లేయర్లు, మాజీ ఆల్‌రౌండర్లు, బౌలర్లు ఆర్సీబీ బౌలింగ్ డిపార్ట్‌ మెంట్‌ను చెడుగుడు ఆడేస్తోన్నారు. ఘాటు వ్యాఖ్యలు చేయడానికీ వారు వెనుకాడట్లేదు.

ఈ బౌలింగ్ అటాక్‌తో ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలవడం అసాధ్యం అంటూ ఇంగ్లాండ్ మాజీ కేప్టెన్, ఒకప్పటి డాషింగ్ ఓపెనర్ మైఖెల్ వానన్ విమర్శించాడు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. దీన్ని ఆర్సీబీ అఫీషియల్ ఎక్స్ అకౌంట్ హ్యాండిల్‌కు ట్యాగ్ చేశాడు. బౌలింగ్‌ను ఖచ్చితంగా మెరుగుపర్చుకోవాల్సి ఉంటుందని సూచించాడు.

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. బౌలింగ్‌ సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఆర్సీబీకి ఉందని తేల్చి చెప్పాడు. ఎంత త్వరగా దీన్ని సార్ట్ అవుట్ చేసుకోగలిగితే అంత బెటర్ అని పేర్కొన్నాడు.

Story first published: Saturday, March 30, 2024, 12:57 [IST]
Other articles published on Mar 30, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+