For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం

Glenn Maxwell: ఐపీఎల్ 2024 సీజన్‌ 17వ ఎడిషన్‌లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. తన మూడో మ్యాచ్ ఆడబోతోంది. హోమ్ పిచ్‌పై కోల్‌కత నైట్ రైడర్స్‌తో తలపడనుంది. సాయంత్రం 7:30 గంటలకు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ మొదలవుతుంది.

కోల్‌కత నైట్ రైడర్స్‌కు ఇది సెకెండ్ గేమ్. ఈ రెండు జట్లు కూడా ఒక్కో మ్యాచ్ గెలిచాయి ఇప్పటివరకు. రెండు పాయింట్లను సాధించాయి. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది కోల్‌కత. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే తన స్థానాన్ని మరింత మెరుగుపర్చుకునే అవకాశాలు ఉన్నాయి.

IPl 2024 RCB vs KKR Glenn Maxwell a worry for Royal Challengers

గత ట్రాక్ రికార్డ్ తిరగేస్తే- నైట్ రైడర్స్ గెలవడానికే ఛాన్సెస్ ఉన్నాయి. బెంగళూరులో ఆర్సీబీతో ఆడిన చివరి అయిదు మ్యాచ్‌లల్లో కోల్‌కతదే పైచేయి. 2016, 2017, 2018, 2019, 2023 సీజన్లల్లో సొంత స్టేడియంలో ఆర్సీబీని ఓడిస్తూ వస్తోంది. 2015లో చివరిసారిగా బెంగళూరులో ఆర్సీబీ చేతిలో ఓడింది కోల్‌కత. అప్పటి నుంచి గత సీజన్ వరకూ అన్నీ విజయాలే.

కాగా- ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌‌వెల్ ఫామ్‌లో లేకపోవటం రాయల్ ఛాలెంజర్స్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లల్లో అతను చేసింది ముచ్చటగా మూడు పరుగులే. రెండు మ్యాచ్‌లల్లో కలిపి ఆరు బంతులను మాత్రమే ఎదుర్కొన్నాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఓపెనర్‌లో గోల్డెన్ డక్ సాధించారు మ్యాక్స్‌వెల్. ఎదుర్కొన్న తొలిబంతికే వెనుదిరిగాడు. దీపక్ చాహర్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. పంజాబ్ కింగ్స్‌తో సొంత గ్రౌండ్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిల్చోలేకపోయాడు. అయిదు బంతులను ఎదుర్కొని మూడు పరుగులు చేసి హర్‌ప్రీత బ్రార్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

IPl 2024 RCB vs KKR Glenn Maxwell a worry for Royal Challengers

పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో బౌలర్‌గా ఫర్వాలేదనిపించుకున్నాడు మ్యాక్స్‌వెల్. మూడు ఓవర్లల్లో 29 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు కూల్చాడు. సీఎస్‌కేతో మ్యాచ్‌లో పెద్దగా బౌలింగ్ చేయలేకపోయాడు. ఒక్క ఓవర్ మాత్రమే సంధించాడు. అతను ఫామ్‌లో లేకపోవడం వల్ల ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్ తడబడుతోంది.

మిడిలార్డర్‌లో మ్యాక్స్‌వెల్ కొద్దిసేపైనా క్రీజ్‌లో నిల్చోగలిగితే గెలుపోటములు తారుమారు కావొచ్చు. బౌలర్ ఎవరైనా సరే ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించే మ్యాడ్ మ్యాక్సీ.. ఈ మ్యాచ్‌లో సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటోన్నారు. బౌలర్లను ఎదుర్కొనడంలో వెనకాముందు చూడకుండా ఆడే మ్యాడ్‌నెస్ మ్యాక్సీ మళ్లీ ఫామ్‌లోకి రావాలని ఫ్రాంఛైజీ సైతం ఆశిస్తోంది.

Story first published: Friday, March 29, 2024, 14:56 [IST]
Other articles published on Mar 29, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+