For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RCB vs KKR: దాన్ని నైట్ రైడర్స్ బ్రేక్ చేయగలదా?

IPL 2024 Points Table: ఐపీఎల్ 2024 సీజన్‌ రసవత్తరంగా సాగుతోంది. అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. థ్రిల్లర్స్‌ను తలపిస్తోన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లల్లో ఘన విజయాలను సాధించింది. నాలుగు పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచింది.

సీఎస్‌కే తరహాలోనే రాజస్థాన్ రాయల్స్ సత్తా చాటుతోంది. ఆడిన రెండింట్లోనూ గెలుపు బావుటా ఎగురవేసింది. నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది సంజు శాంసన్ టీమ్. గురువారం రాత్రి జైపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్‌ను 12 పరుగుల తేడాతో మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్‌లో, అనంతరం బౌలింగ్‌లో రాణించిందీ జట్టు.

IPL 2024 RCB vs KKR Can Knight Riders break the streak of first 9 matches won by the home teams

నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. తన మూడో మ్యాచ్ ఆడబోతోంది. హోమ్ పిచ్‌పై కోల్‌కత నైట్ రైడర్స్‌తో తలపడనుంది. సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. నైట్ రైడర్స్‌కు ఇది సెకెండ్ గేమ్. ఈ రెండు జట్లు కూడా ఒక్కో మ్యాచ్ గెలిచాయి ఇప్పటివరకు. రెండు పాయింట్లను సాధించాయి.

ఇప్పటివరకు ఐపీఎల్‌లో తొమ్మిది మ్యాచ్‌లు జరగ్గా.. అన్నింట్లోనూ హోమ్ టీమ్సే గెలిచాయి. చెన్నై సూపర్ కింగ్స్-2, రాజస్థాన్ రాయల్స్-2, పంజాబ్ కింగ్స్, కోల్‌కత నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్.. తమ సొంత గడ్డపై జయకేతనం ఎగురవేశాయి.

ఇప్పుడు తన హోమ్‌ పిచ్‌పైనే కోల్‌కత నైట్ రైడర్స్‌ను ఢీకొట్టబోతోంది ఆర్సీబీ. హోమ్ గ్రౌండ్స్‌పై కొనసాగుతున్న ఈ జైత్రయాత్రకు కోల్‌కత నైట్ రైడర్స్ అడ్డుకట్ట వేస్తుందా? లేదా? అనేది ఈ రాత్రికి తేలిపోనుంది. నిజానికి- కొంతకాలంగా బెంగళూరు పెద్దగా అచ్చి రావట్లేదు ఆర్సీబీకి. 2016, 2017, 2018, 2019, 2023 సీజన్లల్లో సొంత స్టేడియంలో పరాజయాలను చవి చూసింది.

Story first published: Friday, March 29, 2024, 9:18 [IST]
Other articles published on Mar 29, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+