స్కూల్ ఎగ్గొడ్డానికి డ్యాడీస్ లిటిల్ ప్రిన్సెస్ భలే ప్లాన్ వేసింది కదా
RCB vs KKR: ఐపీఎల్ 2024 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఓటమిని చవి చూసింది. ఇప్పటివరకు ఆడిన మూడింట్లో రెండు ఓడిపోయిన మ్యాచ్‌లల్లో ఓడిపోయింది. తన సొంత గడ్డపై 182 పరుగుల భారీ స్కోర్‌ను చేసినా కూడా మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది. బౌలర్లు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి దిగజారింది.
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత నైట్‌రైడర్స్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో మట్టికరిచింది ఆర్సీబీ. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ- నిర్ణీత 20 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేయగా.. ఇంకా 19 బంతులు మిగిలివుండగానే కేకేఆర్ దాన్ని అవలీలగా కొట్టేసింది.

ఈ సాలా కప్ నమ్మదే అంటూ ప్రతి సంవత్సరం ఊరిస్తూ వస్తోంది ఆర్సీబీ. ఏ సీజన్‌లో కూడా దాన్ని నిజం చేసిన పాపాన పోలేదు. 16 సీజన్లు ఇదే తంతు నడుస్తోంది. కొన్ని సీజన్లల్లో ఫైనల్స్‌కు చేరింది గానీ.. ఛాంపియన్‌గా మాత్రం నిలవలేకపోయింది. ఇది 17వ ఎడిషన్. ఈ సారి కూడా ఆర్సీబీ కప్ కొడుతుందనే ఆశలు ఎంతమాత్రం కూడా లేవు. ఎందుకంటే ఆ స్థాయిలో ఆడట్లేదు కాబట్టి.
సొంత గడ్డపై కోల్‌కత నైట్ రైడర్స్ చేతిలో దారుణంగా ఓడిపోవడమే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు జాయింట్‌గా అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారీ మ్యాచ్‌లో. 182 పరుగుల భారీ టార్గెట్‌ను నైట్ రైడర్స్.. మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి కొట్టిందంటే.. బౌలింగ్ ఎంత నాసిరకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఏదెలా ఉన్నప్పటికీ.. ఆర్సీబీ- కేకేఆర్ మ్యాచ్ నడుస్తున్నప్పుడు చిన్నస్వామి స్టేడియంలో ఓ ఫ్యాన్ గర్ల్ ప్రదర్శించిన ఓ పోస్టర్ ఆకట్టుకుంది. Not going to School until RCB wins the IPL ఆర్సీబీ కప్ కొట్టేంత వరకూ స్కూల్‌కు వెళ్లను అనేది దాని సారాంశం. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications