Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆర్సీబీ ఓటమికి కారణాలు ఎన్నని చెప్పగలం

RCB vs KKR: ఐపీఎల్ 2024 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఓటమిని చవి చూసింది. ఇప్పటివరకు ఆడిన మూడింట్లో రెండు ఓడిపోయిన మ్యాచ్‌లే ఉన్నాయి. తన సొంత గడ్డపై 182 పరుగుల భారీ స్కోర్‌ను చేసినా గానీ దాన్ని కాపాడుకోలేకపోయింది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి దిగజారింది.

ఏడు వికెట్ల తేడాతో..

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత నైట్‌రైడర్స్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో మట్టికరిచింది ఆర్సీబీ. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ- నిర్ణీత 20 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేయగా.. ఇంకా 19 బంతులు మిగిలివుండగానే కేకేఆర్ దాన్ని కొట్టి అవతలపడేసింది.

IPL 2024 RCB vs KKR 5 Reasons for Royal Challengers lost the match at home pitch

ఒక్కడి మీదే డిపెండ్

ఫాఫ్ డుప్లెసిస్, కామెరాన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, రజత్ పటిదార్, అనూజ్ రావత్.. వంటి టాప్ క్లాస్ బ్యాటర్లు టీమ్‌లో ఉన్నప్పటికీ- బరువు మాత్రం విరాట్ కోహ్లీనే మోశాడు. గ్రీన్, మ్యాక్సీ మినహా మరెవరూ కూడా నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో కోహ్లీకి అండగా నిలవలేకపోయారు. చివర్లో క్రీజ్‌లోకి వచ్చిన దినేష్ కార్తీక్ తనకు అలవాటైన రీతిలో భారీ షాట్లు బాదడంతో ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది ఆర్సీబీ.

టాప్ ఆర్డర్ విఫలం..

ఆర్సీబీ టాప్ టు మిడిలార్డర్ బ్యాటర్లు విఫలం అయ్యారు. ఫాఫ్- 8, రజత్ పటిదార్- 3, అనూజ్ రావత్- 3 పరుగులు చేశారు. ఉన్నంతలో కామెరాన్ గ్రీన్- 33, మ్యాక్స్‌వెల్- 28 పరుగులు చేశారు గానీ అది వారి స్థాయికి తగ్గ ఆటతీరు కాదు. ఒకదశలో స్కోర్ బోర్డు 200 పరుగులను దాటుతుందనిపించిన దశలో వరుసగా వికెట్లు పడటం స్కోర్ బోర్డు వేగానికి కళ్లెం పడినట్టయింది.

ముంచిన బౌలర్లు..

బ్యాటింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో ఇద్దరు ముగ్గురు రాణించగలిగారు గానీ బౌలర్లు మాత్రం పూర్తిగా చేతులెత్తేశారు. ఒక్కరు కూడా కోల్‌కత బ్యాటర్లను భయపెట్టలేకపోయారు. వారిని ఒత్తిడిలోకి నెట్టలేకపోయారు. ఒక్క విజయ్‌కుమార్ వైశాఖ్ మాత్రమే నైట్‌రైడర్లను అదుపులో ఉంచగలిగాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 23 పరుగులే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.

సిరాజ్ మియా..

ఐపీఎల్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన మహ్మద్ సిరాజ్.. ఈ మ్యాచ్‌లో కూడా తేలిపోయాడు. ధారాళంగా పరుగులను సమర్పించుకున్నాడు. మూడు ఓవర్లల్లో ఏకంగా 46 పరుగులను పిండుకున్నారు నైట్ రైడర్స్ బ్యాటర్లు. ఇందులో ఒక ఫోర్, అయిదు సిక్సులు ఉన్నాయి. సిరాజ్ బౌలింగ్‌లోనే అత్యధికంగా అయిదు సిక్సులు కొట్టారు బ్యాటర్లు. అల్జారీ జోసెఫ్, యాష్ దయాళ్.. ఘోరంగా విఫలం అయ్యారు.

Story first published: Saturday, March 30, 2024, 7:39 [IST]
Other articles published on Mar 30, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+