Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీ రిటైర్మెంట్‌పై ఓ క్లారిటీ వచ్చింది భయ్యా: లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌పైనా

RCB vs CSK: ఐపీఎల్ 2024లో భాగంగా ఈ శనివారం మరో హైఓల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. చెన్నై సూపర్ కింగ్స్‌ను ఢీ కొట్టబోతోంది. ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలంటే- ఈ రెండు జట్లకూ గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది. ఈ రెండు జట్లకూ ఇదే చివరి మ్యాచ్.

ఇందులో ఓడితే ఆర్సీబీ ప్రస్థానం 12 పాయింట్ల వద్దే స్తంభించిపోతుంది. చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్‌కు చేరువ అవుతుంది. ఈ మ్యాచ్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు- ఈ ఉదయం బెంగళూరుకు చేరుకుంది కూడా. ఈ రెండు రోజులూ నెట్ ప్రాక్టీస్‌లో మునిగి తేలనున్నాయి ఆర్సీబీ, సీఎస్‌కే.

IPL 2024 RCB vs CSK MS Dhoni is going for another couple of years says Mike Hussey

ఈ పరిస్థితుల్లో సీఎస్‌కే బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ.. స్పోర్ట్స్ వెబ్‌సైట్ ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఆటతీరు, మాజీ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ సహా.. పలు అంశాలను ప్రస్తావించాడు. ప్రత్యేకించి- ధోనీ రిటైర్మెంట్ గురించి తనకు ఉన్న అంచనాలను వెల్లడించాడు.

ధోనీ ఇప్పటికీ తన ఛరిష్మాను కోల్పోలేదని, ఇదివరకట్లాగే బ్యాటింగ్ చేస్తోన్నాడని మైక్ హస్సీ పేర్కొన్నాడు. ఈ సీజన్ అంతా ఫామ్‌లో ఉన్నాడని గుర్తు చేశాడు. డెత్ ఓవర్లల్లో ఎలా ఆడాలో సరిగ్గా అలాంటి ఆటే ప్రదర్శిస్తోన్నాడని చెప్పాడు. గత ఏడాది మోకాలికి శస్త్రచికిత్స చేసుకున్నప్పటికీ.. ఈ సీజన్‌ ఆరంభం నుంచీ దూకుడుగా ఆడుతున్నాడని ప్రశంసించాడు.

ధోనీ మరో రెండు ఐపీఎల్ సీజన్లు ఆడొచ్చని తాను వ్యక్తిగతంగా భావిస్తున్నట్లు చెప్పాడు మైక్ హస్సీ. మరో రెండు సీజన్లల్లో ఆడగలిగే ఫిట‌్‌నెస్‌కు ధోనీ ఉందని చెప్పాడు. ఆడాలని కూడా తాను ఆశిస్తున్నట్లు చెప్పాడు. అతను నిర్ణయం ఏమిటనేది వేచి చూడాల్సి ఉంటుందని, ఒక ఫైన్ మార్నింగ్ తన నిర్ణయాన్ని వెల్లడిస్తాడని వ్యాఖ్యానించాడు.

IPL 2024 RCB vs CSK MS Dhoni is going for another couple of years says Mike Hussey

మోకాలి శస్త్ర చికిత్స వల్ల ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు రావట్లేదని వివరణ ఇచ్చాడు మైక్ హస్సీ. బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు రావాలని అభిమానులు కోరుకుంటోన్నారనే విషయం తనకు తన దృష్టికి వచ్చిందని, సర్జరీ వల్ల తాము నిర్ణయం ఆ నిర్ణయం తీసుకోవట్లేదని చెప్పాడు. డెత్ ఓవర్లల్లోనే వస్తాడని, ధోనీలాగా చివరి ఓవర్లల్లో క్లీన్‌ హిట్ ఎవరూ చేయలేరని అన్నాడు.

కేప్టెన్సీ మార్పు వ్యవహారం తనకూ ఆశ్చర్యపరిచిందని మైక్ హస్సీ వ్యాఖ్యానించాడు. సీఎస్‌కే కేప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ అపాయంట్ అవుతున్నట్లు చివరి వరకూ తనకు తెలియదని చెప్పాడు. కేప్టెన్సీ బదిలీ వ్యవహారం సజావుగా సాగిందని, ఎక్కడా ఎలాంటి అసమ్మతి తలెత్తలేదని అన్నాడు.

Story first published: Thursday, May 16, 2024, 15:08 [IST]
Other articles published on May 16, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+