Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB playing XI: మాక్సీపై వేటు? SRHతో ఆడే తుదిజట్టు ఇదే!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో సమరానికి సిద్ధమైంది. సొంతమైదానంలో చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సోమవారం తలపడనుంది. ఈ సీజన్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ కేవలం ఒకే విజయంతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ప్రతి ఏడాది మాదిరిగానే'ఈ సాలా కప్ నమదే' అంటూ ఉత్సాహంతో బరిలోకి దిగి పేలవమైన ప్రదర్శన మరోసారి కొనసాగిస్తోంది.

అయితే ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే రేపు ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగే మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తప్పక సత్తాచాటాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పు గురించి ఆర్సీబీ మేనేజ్మెంట్ మరోసారి తీవ్రంగా ఆలోచిస్తోంది. ఆరు మ్యాచ్‌లు ముగిసినప్పటికీ సమర్థవంతమైన తుదిజట్టును బెంగళూరు ఇప్పటికీ నిర్ధారించుకోలేకపోతుంది.

IPL 2024 RCB Predicted Playing XI Against Sunrisers Hyderabad Another chance for Maxwell

భారీ అంచనాలు ఉన్న ప్లేయర్లు విఫలమవ్వడం, కొత్తగా అవకాశాలు ఇచ్చిన ఆటగాళ్లు నిరూపించుకోలేకపోవడం.. ఇలా ఎటూ చూసినా ఆర్సీబీకి ప్రతికూలతలే కనిపిస్తున్నాయి. విరాట్ కోహ్లి సూపర్ ఫామ్, ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రజత్ పటిదార్, దినేశ్ కార్తీక్ రాణించడమే కాస్త పాజిటివ్‌గా కనిపిస్తుంది. ఇక మాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, మహ్మద్ సిరాజ్ ఫామ్‌లో లేకపోవడం బెంగళూరుకు గట్టి ఎదురుదెబ్బగా తగిలింది.

ఈ సీజన్‌లో మాక్స్‌వెల్ ప్రదర్శన తీసికట్టుగా ఉంది. వరుసగా 0,3, 28, 0, 1, 0 పరుగులు చేశాడు. మూడు సార్లు డకౌటవ్వడం గమనార్హం. ఈ నేపథ్యంలో మాక్సీని జట్టు నుంచి తప్పించాలని డిమాండ్ పెరుగుతోంది. కానీ సన్‌రైజర్స్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, షాబాజ్ అహ్మద్ ఎడమచేతి వాటం బ్యాటర్లు కావడంతో మాక్స్‌వెల్ బంతితో ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయని ఆర్సీబీ మేనేజ్మెంట్ భావిస్తోంది. అయితే అభిషేక్, హెడ్ మిడిల్‌ఓవర్లలో ఉంటేనే మాక్సీకి బంతిని అందివ్వడం సాధ్యమవుతుంది.

అలాగే బౌండరీ దూరం దగ్గరగా ఉండే చిన్నస్వామి స్టేడియంలో ఎస్‌ఆర్‌‌హెచ్ భారీ హిట్టర్లు మాక్స్‌వెల్‌తో బౌలింగ్ చేయించడం మరింత ప్రమాదకరం. అయితే మాక్సీ బ్యాటర్‌గా కుదురుకుంటే కొండంత లక్ష్యాన్ని కూడా సాధించవచ్చు. దీంతో మాక్స్‌వెల్ విషయం ఆర్సీబీకి తలనొప్పిగా మారింది. కొనసాగించలేక, తప్పించలేక సతమతమవుతోంది. అయితే రేపటి మ్యాచ్‌లో మాక్సీకి చివరగా మరో అవకాశం ఇచ్చేలా కనిపిస్తోంది. మాక్సీపై వేటు వేయాలని సోషల్ మీడియాలో వినిపిస్తున్న డిమాండ్‌ను పక్కనపెట్టాలని ఆర్సీబీ భావిస్తోంది.

ఆర్సీబీ తుది జట్టు (అంచనా)
డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, విల్ జాక్స్, గ్లెన్ మాక్స్‌వెల్, రజత్ పటిదార్, దినేశ్ కార్తీక్, మహిపాల్ లోమ్రర్, టోప్లే, విజయ్‌కుమార్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్

ఆర్సీబీ జట్టు: డుప్లెసిస్, కోహ్లి, గ్రీన్ ,రజత్ పటిదార్, మాక్స్ వెల్, అనుజ్ రావత్, దినేశ్ కార్తీక్, అల్జారీ జోసెఫ్, మయాంక్ దాగర్, మహమ్మద్ సిరాజ్, యష్ దయాల్, మహిపాల్ లోమ్రర్, సుయాష్ ప్రభుదేసాయి, కర్ణ్ శర్ , విజయ్ కుమార్ వైశాక్, స్వప్నిల్ సింగ్, లాకీ ఫెర్గూసన్, విల్ జాక్స్, మనోజ్ భాందగే, ఆకాశ్ దీప్, సౌరవ్ చౌహాన్, రాజన్ కుమార్ , హిమాన్షు శర్మ, టోప్లే, టామ్ కరన్.

Story first published: Sunday, April 14, 2024, 14:49 [IST]
Other articles published on Apr 14, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+