Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB playing XI: ఆ ఇద్దరిపై వేటు..ముంబైతో ఆడే తుదిజట్టు ఇదే!

'ఈ సాలా కప్ నమదే' అంటూ ఉత్సాహంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ ఐపీఎల్ సీజన్‌లో పేలవమైన ప్రదర్శన కొనసాగిస్తోంది. బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లిపై అతిగా ఆధారపడటం, బౌలింగ్‌లో సమష్టి వైఫల్యంతో ఆర్సీబీ నిరాశపరుస్తోంది. అయిదు మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు ఒకే విజయంతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది.

లీగ్ స్టేజ్‌లో ఆర్సీబీకి మరో తొమ్మిది మ్యాచ్‌లే మిగిలి ఉన్నాయి. ఈ సీజన్‌లో టైటిల్ రేసులో నిలవాలంటే బెంగళూరు తప్పక తిరిగి గెలుపు బాట పట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గత మ్యాచ్ పొరపాట్లను సరిదిద్దుకుని గురువారం ముంబై ఇండియన్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో సత్తాచాటాలని పట్టుదలతో ఆర్సీబీ జట్టు సన్నద్ధమవుతోంది.

IPL 2024 RCB playing XI vs Mumbai Indians- Mayank Dagar and Sourav Likely to Make Way for Vijaykumar-Mahipal in the Team

అయితే స్టార్ ప్లేయర్లు డుప్లెసిస్, మాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్ ఫామ్‌లో లేకపోవడం ఆర్సీబీకి ప్రధాన సమస్యగా మారింది. జట్టును ఉత్తమంగా నడిపించాల్సిన డుప్లెసిస్ టీమ్‌కు భారంగా మారాడు. మరోవైపు మాక్సీ, గ్రీన్ తప్పించే సాహసాన్ని టీమ్ మేనేజ్మెంట్ చేయలేకపోతుంది. కొన్నిఓవర్ల పాటు క్రీజులో ఉన్న వారిద్దరు మ్యాచ్ గమనాన్ని మార్చేస్తారు. అందుకే పరుగులు సాధించలేకపోతున్నా జట్టులో వాళ్లను కొనసాగిస్తూ భారత యువ క్రికెటర్లపై మరోసారి వేటు వేయాలని ఆర్సీబీ యాజమాన్యం భావిస్తోంది.

అలాగే మ్యాచ్ జరగనున్న వాంఖడే స్టేడియంలో భారీ స్కోరు నమోదయ్యే అవకాశాలు ఎక్కువ ఉండే కారణంతోనూ మాక్సీ, గ్రీన్‌ను జట్టులో కొనసాగించాలని ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో జట్టులో స్పిన్నర్లను తొలగించి ఫాస్ట్ బౌలర్లను తీసుకోవాలని ప్లాన్ చేస్తోంది. రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో నిరాశపరిచిన మయాంక్ దాగర్‌ను, అలాగే సౌరవ్ చౌహన్‌పై వేటు వేయాలని భావిస్తోంది. వారిద్దరి స్థానంలో మహిపాల్ లోమ్రర్, విజయ్‌కుమార్ వైశాక్‌ను తుది జట్టులోకి తీసుకోవాలనుకుంటుంది.

గత రాజస్థాన్ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన సౌరవ్ చౌహన్‌కు మరో అవకాశం ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. సౌరవ్‌ను కొనసాగించాలని భావిస్తే మహిపాల్ లోమ్రార్ బెంచ్‌కు పరిమితం కావాల్సి వస్తుంది. ముంబై జట్టులో భారీ హిట్టర్లు ఉండటంతో స్పిన్‌కు బదులుగా పేస్‌ను అస్త్రంగా వాడాలని ఆర్సీబీ ప్రణాళికను రచిస్తోంది. కాగా, ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఆర్సీబీ, ముంబై 32 సార్లు తలపడగా ముంబై ఇండియన్స్ 18 సార్లు విజయం సాధించింది. బెంగళూరు జట్టు 14 మ్యాచ్‌ల్లో గెలిచింది.

ఆర్సీబీ తుది జట్టు (అంచనా)
డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, కామెరూన్ గ్రీన్, గ్లెన్ మాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్, రజత్ పటిదార్, సౌరవ్ చౌహన్/మహిపాల్ లోమ్రర్, టోప్లే విజయ్‌కుమార్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్

ఆర్సీబీ జట్టు: డుప్లెసిస్, కోహ్లి, గ్రీన్ ,రజత్ పటిదార్, మాక్స్ వెల్, అనుజ్ రావత్, దినేశ్ కార్తీక్, అల్జారీ జోసెఫ్, మయాంక్ దాగర్, మహమ్మద్ సిరాజ్, యష్ దయాల్, మహిపాల్ లోమ్రర్, సుయాష్ ప్రభుదేసాయి, కర్ణ్ శర్ , విజయ్ కుమార్ వైశాక్, స్వప్నిల్ సింగ్, లాకీ ఫెర్గూసన్, విల్ జాక్స్, మనోజ్ భాందగే, ఆకాశ్ దీప్, సౌరవ్ చౌహాన్, రాజన్ కుమార్ , హిమాన్షు శర్మ, టోప్లే, టామ్ కరన్.

Story first published: Tuesday, April 9, 2024, 15:30 [IST]
Other articles published on Apr 9, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+