ఐపీఎల్ 17వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. చిన్నస్వామి స్టేడియంలో రేపు లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన 13 మ్యాచ్‌ల్లో 12 సొంతమైదానంలో ఆడిన జట్లే విజయం సాధించాయి. ఒక్క ఆర్సీబీ మాత్రమే హోమ్ గ్రౌండ్‌లో ఓడింది.
లక్నోపై విజయం సాధించి తిరిగి గెలుపు బాట పట్టాలని ఆర్సీబీ పట్టుదలతో బరిలోకి దిగుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు ఒక్క విజయం మాత్రమే సాధించింది. పంజాబ్‌పై గెలిచిన ఆర్సీబీ.. సీఎస్‌కే, కేకేఆర్ చేతిలో ఓటమిపాలైంది. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ ఆడిన రెండింట్లో ఓ విజయం, ఓ గెలుపు సాధించింది. రేపటి మ్యాచ్‌లో సత్తాచాటి గెలవాలని లక్నో ఆశిస్తోంది.

ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఆర్సీబీ, లక్నో నాలుగు సార్లు తలపడ్డాయి. మూడింట్లో బెంగళూరు, ఓ మ్యాచ్‌లో లక్నో విజయం సాధించింది. అయితే రేపటి మ్యాచ్‌కు ఆర్సీబీ తుదిజట్టులో మార్పులు చేయాలని భావిస్తోంది. వేలంలో రూ.11.50 కోట్లకు కొనుగోలు చేసిన అల్జారీ జోసెఫ్‌ను తప్పించాలని ఆలోచిస్తోంది. మూడు మ్యాచ్‌లు ఆడిన అతడు ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. 11 ఎకానమీ రేటుతో పరుగులు సమర్పించుకున్నాడు. హోమ్ గ్రౌండ్‌తో జరిగిన కేకేఆర్ మ్యాచ్‌లో 2 ఓవర్లకు ఏకంగా 34 పరుగులు ఇచ్చాడు. దీంతో అతడిపై వేటు వేయాలని మేనేజ్మెంట్ భావిస్తోంది.
అల్జారీ జోసెఫ్ స్థానంలో లాకీ ఫెర్గూసన్ లేదా విల్ జాక్స్‌ను తీసుకోవాలని భావిస్తోంది. ఫాస్ట్ బౌలర్ అయిన ఫెర్గూసన్ డెత్ ఓవర్లలో చక్కగా బౌలింగ్ చేయగలడు. జాక్స్ ఆఫ్ స్పిన్‌తో పాటు బ్యాటుతోనూ సత్తాచాటగలడు. వీరిద్దరిలో ఫెర్గూసన్ వైపే టీమ్ మేనేజ్మెంట్ మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. అలాగే విజయ్‌కుమార్ వైశాక్‌ను జట్టులోకి తీసుకురావడానికి ఆర్సీబీ ట్రై చేస్తోంది.
ఆర్సీబీ తుది జట్టు (అంచనా)
డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, కామెరూన్ గ్రీన్, గ్లెన్ మాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్, అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రర్/ రజత్ పటిదార్, లాకీ ఫెర్గూసన్, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్
ఆర్సీబీ జట్టు: డుప్లెసిస్, కోహ్లి, గ్రీన్ ,రజత్ పటిదార్, మాక్స్ వెల్, అనుజ్ రావత్, దినేశ్ కార్తీక్, అల్జారీ జోసెఫ్, మయాంక్ దాగర్, మహమ్మద్ సిరాజ్, యష్ దయాల్, మహిపాల్ లోమ్రర్, సుయాష్ ప్రభుదేసాయి, కర్ణ్ శర్ , విజయ్ కుమార్ వైశాక్, స్వప్నిల్ సింగ్, లాకీ ఫెర్గూసన్, విల్ జాక్స్, మనోజ్ భాందగే, ఆకాశ్ దీప్, సౌరవ్ చౌహాన్, రాజన్ కుమార్ , హిమాన్షు శర్మ, టోప్లే, టామ్ కరన్.