Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆర్సీబీ తుది జట్టు (అంచనా)

ఐపీఎల్-2024 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రేపు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు ఇప్పటికే ఓ మ్యాచ్‌లో తలపడ్డాయి. చిన్నస్వామి స్టేడియలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఏడు వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఇప్పుడు ఈ ఓటమికీ ప్రతీకారం తీర్చుకోవాలని కసితో రగిలిపోతుంది.

అయితే ఆర్సీబీ ఈ సీజన్‌లో అంచనాలను అందుకోలేకపోతుంది. ప్రతి ఏటా తరహాలోనే ఈ సీజన్‌లోనూ 'ఈ సాలా కప్ నమదే' అంటూ ఉత్సాహంతో బరిలోకి దిగి మరోసారి చతికలపడింది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క విజయమే సాధించి అట్టర్ ఫ్లాప్ అయ్యింది. పాయింట్ల పట్టికలో అట్టడుగన నిలిచింది.

IPL 2024 RCB playing XI vs KKR - Cameron Green likey to replace Will Jacks

అయితే టెక్నికల్‌గా ఆర్సీబీ ఇంకా ప్లేఆఫ్స్ పోటీలో ఉంది. ఈ సీజన్ రెండో అర్ధభాగంలో చెలరేగితే నాకౌట్ దశకు చేరే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేకేఆర్‌పై విజయం సాధించి సెకండ్ పార్ట్‌ను ఘనంగా ఆరంభించాలని బెంగళూరు ఉవ్విళ్లూరుతోంది. ప్రత్యేక వ్యూహాలతో కోల్‌కతాను ఓడించాలని ప్రణాళికలు రచిస్తోంది.

బౌలర్ల కంటే బ్యాటర్ల బలాన్ని నమ్ముకుని మైదానంలో అడుగుపెట్టాలని ఆలోచిస్తోంది. ఈ క్రమంలో మరోసారి తుదిజట్టులో మార్పులు చేయాలని భావిస్తోంది. మానసిక అలసట, ఫామ్ లేమి కారణంగా విరామం తీసుకున్న మాక్స్‌వెల్‌ను తిరిగి జట్టులోకి తీసుకురావాలని చూస్తోంది. మాక్సీ సిద్ధంగా లేకపోతే కామెరూన్ గ్రీన్‌ను ఎంపిక చేయాలనుకుంటుంది. విల్ జాక్స్, టోప్లేల‌లో ఒకరిపై వేటు వేయాలని భావిస్తోంది.

ఇటీవల కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో గ్రీన్, మాక్సీ కాస్త ఫర్వాలేదనిపించే ప్రదర్శన చేశారు. దీంతో వారిద్దరిని జట్టులోకి తీసుకురావాలనే ఆలోచనతోనూ ఆర్సీబీ ఉంది. కాగా, ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఆర్సీబీ, కేకేఆర్ 33 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. 19 మ్యాచ్‌ల్లో కోల్‌కతా, 14 పోరుల్లో బెంగళూరు నెగ్గింది.

ఆర్సీబీ తుది జట్టు (అంచనా)
డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, విల్ జాక్స్/కామెరూన్ గ్రీన్, రజత్ పటిదార్, దినేశ్ కార్తీక్, సౌరవ్ చౌహన్, మహిపాల్ లోమ్రర్, లాకీ ఫెర్గూసన్, విజయ్ కుమార్ వైశాక్, మహ్మద్ సిరాజ్, టోప్లే

ఆర్సీబీ జట్టు: డుప్లెసిస్, కోహ్లి, గ్రీన్ ,రజత్ పటిదార్, మాక్స్ వెల్, అనుజ్ రావత్, దినేశ్ కార్తీక్, అల్జారీ జోసెఫ్, మయాంక్ దాగర్, మహమ్మద్ సిరాజ్, యష్ దయాల్, మహిపాల్ లోమ్రర్, సుయాష్ ప్రభుదేసాయి, కర్ణ్ శర్ , విజయ్ కుమార్ వైశాక్, స్వప్నిల్ సింగ్, లాకీ ఫెర్గూసన్, విల్ జాక్స్, మనోజ్ భాందగే, ఆకాశ్ దీప్, సౌరవ్ చౌహాన్, రాజన్ కుమార్ , హిమాన్షు శర్మ, టోప్లే, టామ్ కరన్.

Story first published: Saturday, April 20, 2024, 16:04 [IST]
Other articles published on Apr 20, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+