Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL Playoffs: గుజరాత్ గెలుపుతో RCB హ్యాపీ.. CSK పరిస్థితి ఏంటి?

ఐపీఎల్-2024లో ప్రీక్లైమాక్స్ ఫైట్ మొదలైంది. ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతోంది. మ్యాచ్ మ్యాచ్‌కు సమీకరణాలు మారిపోతున్నాయి. ఓ టీమ్ ఓటమి మరికొన్ని జట్లకు సంతోషాన్ని ఇస్తుంది. మరో జట్టు విజయాన్ని ఇతర ఫ్రాంచైజీలు ఆస్వాదిస్తున్నాయి. శనివారం గుజరాత్ టైటాన్స్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమిపాలవ్వడం ఏకంగా నాలుగు జట్లకు కలిసొచ్చింది.

పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ చేరుకోవడం దాదాపు ఖాయమైంది. ఇవాళ ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో కేకేఆర్ గెలిస్తే ఆ జట్టు అధికారికంగా తదుపరి దశకు చేరుకుంటుందిది. ఇక మూడో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఓ పోరును భారీ విజయంతో సాధించినా సరిపోతుంది. 16 పాయింట్లు, మెరుగైన నెట్‌రన్‌రేటుతో ఎస్ఆర్‌హెచ్‌కు ఢోకా ఉండదు.

IPL 2024 RCB Happy with Gujarat Titans s Win What About CSK s Playoff Scenario

ఇక అసలైన పోటీ అంతా నాలుగో స్థానం కోసమే. దీని కోసం అయిదు జట్లు పోటీపడుతున్నాయి. చెన్నైను గుజరాత్ ఓడించడంతో అన్ని జట్ల కంటే ఆర్సీబీ ఎక్కువగా ఆనందిస్తోంది. తమ జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగయ్యాయి. ప్రస్తుతం బెంగళూరు పది పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. అంతిమంగా ఆర్సీబీ టాప్-4‌లో నిలవాలంటే..

తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌‌లపై బెంగళూరు గెలవాలి. అలాగే ఆదివారం జరగనున్న మ్యాచ్‌లో సీఎస్కే‌ను రాజస్థాన్ రాయల్స్ ఓడించాలి. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్‌ను ముంబై చిత్తు చేయాలి. ఇక గుజరాత్ టైటాన్స్‌కు కేకేఆర్ లేదా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి రుచి చూపించాలి. ఒకవేళ గుజరాత్ గెలిచినా ఆర్సీబీకి ఇబ్బందేమి లేదు. అయితే గుజరాత్ స్వల్ప తేడాతో విజయం సాధించాలి. అప్పుడు బెంగళూరు టాప్-4లో నిలుస్తుంది.

సీఎస్కే పరిస్థితేంటి?
చెన్నై 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ప్లేఆఫ్స్‌లో నిలవాలంటే చెన్నై తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీపై గెలవాలి. ఈ రెండింట్లో గెలిచి మెరుగైన నెట్ ర‌న్ రేటు ఉంటే సీఎస్కే ఈజీగా తదుపరి దశకు చేరుకుంటుంది. ఒక వేళ రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడినా ప్లేఆఫ్స్ చేరాలంటే ఇలా జరగాలి.

లక్నో సూపర్ జెయింట్స్‌ను ముంబై ఇండియన్స్ లేదా ఢిల్లీ క్యాపిటల్స్ ఓడించాలి. లక్నోపై ఢిల్లీ గెలిస్తే, ఢిల్లీని ఆర్సీబీ తప్పక చిత్తుచేయాలి. ఆ తర్వాత బెంగళూరును సీఎస్కే ఓడించాలి. అప్పుడు చెన్నై ప్లేఆఫ్స్‌కు వెళ్తుంది.ఇప్పటికే ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.

Story first published: Saturday, May 11, 2024, 8:44 [IST]
Other articles published on May 11, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+