For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RCB: కొత్తగా ఏం జరిగింది..మనకి అలవాటే కదా!

ఐపీఎల్ 2024 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేలవ ప్రదర్శన చేస్తోంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్క విజయమే సాధించింది. ఈ సీజన్‌లో ఆలౌటైన ఏకైక జట్టుగా, హోమ్‌‌ గ్రౌండ్‌లో రెండు ఓటములు చవిచూసిన టీ‌మ్‌గా బెంగళూరు చెత్త రికార్డు నెలకొల్పింది. పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఆఖరి స్థానంలో ముంబయి ఇండియన్స్ ఉంది.

చిన్నస్వామి స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 28 పరుగుల తేడాతో ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో అయిదు వికెట్లకు 181 పరుగులు చేసింది. డికాక్ (81; 56 బంతుల్లో, 8×4, 5×6), నికోలస్ పూరన్‌ (40*‌; 21 బంతుల్లో, 1×4, 5×6) సత్తాచాటారు.అనంతరం ఛేదనలో ఆర్సీబీ 19.4 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌటైంది. మహిపాల్ లోమ్రర్ (33; 13 బంతుల్లో, 3×4, 3×6), రజత్ పటిదార్ (29; 21 బంతుల్లో, 2×4, 2×6) పోరాడారు. మయాంక్ యాదవ్ (3/14), నవీనుల్ హక్ (2/25) సత్తాచాటారు.

IPL 2024 RCB Facing Heavy Criticism Amidst Poor Performance after defeat by LSG

ఈ నేపథ్యంలో ఆర్సీబీపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి. బెంగళూరు జట్టును దారుణంగా ట్రోల్ చేస్తూ మీమ్స్ వస్తున్నాయి. ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను పక్కనపెట్టడం, ఫామ్‌లో లేని ఆటగాళ్లను జట్టులో కొనసాగించడం ఆర్సీబీకే చెల్లుతుందని కామెంట్లు చేస్తున్నారు. కోల్‌‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో విజయ్‌కుమార్ వైశాక్ పొదుపుగా బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్లలో 23 పరుగులే ఇచ్చి ఓ వికెట్ సాధించాడు. కానీ ఇవాళ మ్యాచ్‌‌లో తుదిజట్టులో అవకాశం ఇవ్వలేదు.

మరోవైపు విఫలమవుతున్నా కామెరూన్ గ్రీన్‌కు ఆర్సీబీ మేనేజ్మెంట్ వరుసగా అవకాశాలు ఇస్తుంది. కానీ గ్రీన్ విఫలమవుతున్నాడు. బౌలింగ్, బ్యాటింగ్‌లో ఫెయిల్ అవుతున్నాడు. లాకీ ఫెర్గూసన్, విల్ జాక్స్ వంటి ప్లేయర్లకు అవకాశం ఇస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని నెటిజన్లు పోస్ట్‌లు పడుతున్నారు. కాగా, ఆర్సీబీకి ఓటములు కొత్తేమి కాదని అంటూ కొందరు ఫన్నీ మీమ్స్ పోస్ట్ చేశారు. వాటిలో కొన్ని మీ కోసం..

Story first published: Wednesday, April 3, 2024, 9:28 [IST]
Other articles published on Apr 3, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+