Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ముంబై ఇండియన్స్‌లో గ్రూపిజం: వాళ్లకు రోహిత్ శర్మ సపోర్ట్?: వెలుగులోకి వచ్చిన రిపోర్ట్

IPL 2024 Mumbai Indians Playoffs chances: ఐపీఎల్ 2024 సీజన్‌‌లో వరుస పరాజయాలతో ముంబై ఇండియన్స్‌ కుదేల్ అవుతోంది. తన స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించట్లేదీ మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్. గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లన్నింట్లోనూ చతికిలపడుతూ వస్తోంది. ఫలితంగా ప్లేఆఫ్స్‌ చేరే అవకాశాలను చేతులారా మట్టిపాలు చేసుకుంది.

ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్‌లల్లో ఓడినవే ఎక్కువ. నాలుగింట్లో గెలిచింది. తొమ్మిది మ్యాచ్‌లల్లో ఘోర పరాజయాన్ని చవి చూసింది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో ఉన్నవి ఎనిమిది పాయింట్లే. పాయింట్ల పట్టికలో పదో స్థానంలో నిలిచింది. అందరికంటే ముందుగానే ప్లేఆఫ్స్ రేసు నుంచి అవుట్ అయిందీ టీమ్.

IPL 2024 Possible rift between Tilak Varma and Hardik Pandya inside the dressing room Reports

లీగ్స్‌లో తన చివరి మ్యాచ్‌ శుక్రవారం ఆడబోతోంది ముంబై ఇండియన్స్. లక్నో సూపర్ జెయింట్స్‌ను ఢీకొట్టబోతోంది. ముంబై వాంఖెడే స్టేడియం దీనికి వేదిక. సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓడిపోతే పెద్దగా ఒరిగేదేమీ లేదు గానీ.. గెలిస్తే మాత్రం లక్నో సూపర్ జెయింట్స్‌కు కొద్దో గొప్పో ఉండే ప్లేఆఫ్స్ అవకాశాలకు గండికొట్టినట్టవుతుంది.

ముంబై ఇండియన్స్ ఇంత దారుణస్థితికి పడిపోవడానికి అసలు కారణాలు ఏమిటనేది అభిమానులకు ముందు నుంచీ తొలుస్తోన్న ప్రశ్న. రోహిత్ శర్మను కాదని.. హడావుడీగా గుజరాత్ టైటాన్స్‌ కేప్టెన్‌ హార్దిక్ పాండ్యాను జట్టులోకి తీసుకోవడం, అతన్ని కేప్టెన్ చేయడం వంటి పరిణామాలన్నీ కూడా జట్టు ప్లేయర్ల ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసినట్టయిందనేది టాక్.

హార్దిక్ పాండ్యా ముంబై జట్టులోకి వచ్చిన తరువాత గ్రూపిజం ఏర్పడిందనే సమాచారం బయటికొచ్చింది. దీని వల్లే ప్లేయర్లు తమ ఆటతీరుపై దృష్టి సారించలేకపోయారని, ప్రత్యేకించి- కేప్టెన్‌గా రోహిత్ శర్మను తొలగించడం, అతని స్థానంలో హార్దిక్ పాండ్యాకు జట్టు పగ్గాలను అప్పగించడాన్ని జీర్ణించుకోలేకపోయారని తెలుస్తోంది.

IPL 2024 Possible rift between Tilak Varma and Hardik Pandya inside the dressing room Reports

ఈ గ్రూపిజంలో- ముంబై ఇండియన్స్‌లో ఉన్న భారత ఆటగాళ్లందరూ రోహిత్ శర్మ వైపు, ఓవర్సీస్ ప్లేయర్లందరూ హార్దిక్ పాండ్యా వైపు నిలిచారని సమాచారం. హార్దిక్ పాండ్యా కేప్టెన్సీని ఏ మాత్రం అంగీకరించలేకపోతున్న వారిలో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఆకాష్ మధ్వాల్, ఇషాన్ కిషన్.. వంటి ప్లేయర్లు రోహిత్ కేప్టెన్సీని కోరుకుంటోన్నారని చెబుతున్నారు.

ఒకదశలో ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో తిలక్ వర్మ- హార్దిక్ పాండ్యా మధ్య గొడవలు సైతం చోటు చేసుకున్నాయని సమాచారం. ఇది- టీమ్ హెడ్ కోచ్ మార్క్ బౌచర్ దృష్టికీ వెళ్లిందని అంటున్నారు. ఈ గ్రూపిజం, గొడవల వల్లే ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో చతికిలపడిందనే అంచనాలు ఉన్నాయి.

నెట్ ప్రాక్టీస్ చేస్తోన్న సమయంలో హార్దిక్ పాండ్యా వచ్చిన కొద్దిసేపటికే సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ.. అక్కడి నుంచి డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కత నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ విభేదాలు స్పష్టంగా బయటపడ్డాయని చెబుతున్నారు.

టిమ్ డేవిడ్, డెవాల్డ్ బ్రేవిస్, ల్యూక్ వుడ్.. వంటి విదేశీ ప్లేయర్లు మాత్రం హార్దిక్ పాండ్యా వైపు మొగ్గు చూపారు. హార్దిక్ కేప్టెన్సీని టిమ్ డేవిడ్ ప్రశంసించడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు.

Story first published: Thursday, May 16, 2024, 12:42 [IST]
Other articles published on May 16, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+