For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆర్సీబీ ఆశలు గల్లంతు?

IPL 2024 RCB Playoffs chances: ఐపీఎల్ 2024 సీజన్‌‌లో ఢిల్లీ కేపిటల్స్ తన చిట్టచివరి మ్యాచ్‌ను ఆడేసింది. లీగ్స్‌ దశలో అన్ని మ్యాచ్‌లనూ ఆడేసిన మొట్టమొదటి జట్టు అదే. తన సొంత గడ్డపై జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై విజయదుందుభి మోగించింది. ఈ గెలుపుతో ప్లేఆఫ్స్‌కు మరింత చేరువ అయింది.

మంగళవారం రాత్రి ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను 19 పరుగుల తేడాతో మట్టికరిపించింది రిషభ్ సేన. తొలుత బ్యాటింగ్‌కు దిగి.. చెలరేగింది. నిర్ణీత 20 ఓవర్లల్లో నాలుగు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ పోరెల్, లోయర్ ఆర్డర్‌లో ట్రిస్టన్ స్టబ్స్ హాఫ్ సెంచరీతో దుమ్ము లేపారు.

IPL 2024 Playoff scenarios How Delhi Capitals win against LSG impacts RCB chances

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లల్లో తొమ్మిది వికెట్ల నష్టానికి 189 పరుగులు చేయగలిగిందంతే. ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే గెలిచి తీరాల్సిన ఈ మ్యాచ్‌లో బ్యాటర్లందరూ మూకుమ్మడిగా చేతులెత్తేశారు. మిడిలార్డర్ బ్యాటర్ నికొలస్ పూరన్, లోయర్ ఆర్డర్‌లో అర్షద్ ఖాన్ పోరాడినప్పటికీ.. ఫలితం అందలేదు.

ఢిల్లీ సాధించిన ఈ విజయం.. ఇప్పటికే దాదాపుగా ప్లే ఆఫ్స్ బెర్త్ కన్‌ఫర్మ్ చేసుకున్న ఇతర జట్లకు ఎర్త్ పెట్టినట్టయింది. ఏడు విజయాలతో మొత్తం 14 పాయింట్లను సాధించింది ఢిల్లీ. ఇక ఆ జట్టు చేతిలో మ్యాచ్‌లేమీ లేవు. అన్నీ ఆడేసింది. మొత్తం 14 మ్యాచ్‌లల్లో గెలుపోటములు సరిసమానం.

ఢిల్లీ కేపిటల్స్ సాధించిన ఈ గెలుపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్ ఆశలను గండికొట్టినట్టయింది. ప్రస్తుతం ఆర్సీబీ ఖాతాలో 12 పాయింట్లు ఉన్నాయి. ఇంకో మ్యాచ్ మిగిలే వుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడాల్సి ఉంది. ఇందులో ఓడితే ఆర్సీబీ ప్రస్థానం 12 పాయింట్ల వద్దే స్తంభించిపోతుంది.

గెలిస్తే మాత్రం ఆసక్తికరంగా మారతాయి ఆర్సీబీ ప్లేఆఫ్స్ అవకాశాలు. చెన్నై సూపర్ కింగ్స్‌పై గెలిస్తే ఆర్సీబీ పాయింట్లు కూడా 14కు చేరుకుంటాయి. పాయింట్లల్లో ఢిల్లీ కేపిటల్స్‌తో సమానంగా నిలుస్తుంది. దాని నెట్ రన్‌రేట్‌ను అధిగమించేలా ఆర్సీబీ తన ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించాల్సి ఉంటుంది.

ఢిల్లీ కేపిటల్స్ నెట్ రన్‌రేట్ మైనస్ 0.377. ఆర్సీబీ నెట్ రన్‌రేట్ ప్లస్ 0.387. చెన్నై సూపర్ కింగ్స్‌పై గెలిస్తే ఖచ్చితంగా దాని నెట్ రన్‌రేట్ మెరుగుపడుతుంది. చెన్నైని కూడా 14 పాయింట్ల వద్దే కట్టడి చేసినట్టవుతుంది. చెన్నై సూపర్ కింగ్స్‌కు కూడా అదే చివరి మ్యాచ్.

సర్వశక్తులనూ ఒడ్డి ఆడే చెన్నైని ఆర్సీబీ ఎంతవరకు నిలువరిస్తుందనేది దాని పెర్‌ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంది. తన చివరి అయిదు మ్యాచ్‌లల్లో తిరుగులేని విజయాలను అందుకుంది ఆర్సీబీ. అదే దూకుడును కొనసాగించగలిగితే మాత్రం ప్లేఆఫ్స్‌ కోసం టఫ్ ఫైట్ ఇచ్చినట్టవుతుంది. మంచి నెట్ రన్‌రేట్‌తో నెగ్గగలిగితే ప్లేఆఫ్స్ చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Story first published: Wednesday, May 15, 2024, 9:40 [IST]
Other articles published on May 15, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+