ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. అయితే సన్‌రైజర్స్ 64 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి (64; 37 బంతుల్లో, 4x4, 5x6) అద్భుత పోరాటంతో ఆదుకున్నాడు.
నితీశ్ రెడ్డి తాను ఎదుర్కొన్న తొలి 18 బంతుల్లో 14 పరుగులే చేశాడు. కానీ ఆ తర్వాత పంజాబ్ బౌలర్లపై విధ్వంసం సృష్టించాడు. 19 బంతుల్లో 50 పరుగులు చేశాడు. అర్ధశతకంతో సత్తాచాటి పంజాబ్ ముందు సవాలైన లక్ష్యాన్ని ఉంచాడు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ (4/29) నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం ఛేదనలో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 180 పరుగులకే పరిమితమైంది.

పంజాబ్‌కు కూడా పేలవారంభం దక్కింది. 58 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. కానీ ఆఖర్లో శశాంక్ సింగ్ (46*; 25 బంతుల్లో, 6x4, 1x6), అశుతోష్ శర్మ (33*; 15 బంతుల్లో, 3x4, 2x6) గట్టిగా పోరాడారు. భువనేశ్వర్ కుమార్ (2/32), కమిన్స్ (1/22) ఆకట్టుకున్నారు. మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన నితీశ్ రెడ్డి 33 పరుగులు ఇచ్చి ఓ వికెట్ పడగొట్టాడు.
విజయంలో కీలకపాత్ర పోషించిన నితీశ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా నితీశ్ మాట్లాడుతూ తన ఆల్‌రౌండర్ షోను కొనసాగిస్తానని చెప్పాడు. ''ఈ ఇన్నింగ్స్ నాకు, నా జట్టుకు ఎంతో కీలకం. నాపై నేను నమ్మకంతో ఉండాలని చెప్పుకుంటాను. అయితే పంజాబ్ మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్లు బౌలింగ్ కట్టుదిట్టంగా చేస్తున్నారు. కాబట్టి వాళ్ల బౌలింగ్‌లో సంయమనంతో ఆడాలనుకున్నా. స్పిన్నర్లు వచ్చినప్పుడు దాడికి దిగుతూ దూకుడుగా బ్యాటింగ్ చేయాలని భావించి ఆడాను'''
''ఇక నా బౌలింగ్ విషయానికొస్తే.. ఈ టోర్నమెంట్‌లో స్లో బౌన్సర్స్ వర్కౌట్ అవుతున్నాయి. అందుకే పిచ్‌ను ఉపయోగించి బౌలింగ్ చేశా. జట్టు కోసం ఇదే తరహా ప్రదర్శన కొనసాగించాలనుకుంటున్నా. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ సత్తాచాటాలనుకుంటున్నా'' అని నితీశ్ రెడ్డి పేర్కొన్నాడు. అయితే నితీశ్ రెడ్డి ఓ ఓల్డ్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. గత సీజన్‌లో సన్‌రైజర్స్ గూటికి చేరిన నితీశ్ ఓ ఇంటర్వ్యూలో స్టార్ హీరో పవన్ కల్యాణ్ గురించి మాట్లాడాడు. మ్యాచ్‌కు ముందు జానీ సినిమాలోని 'నారాజుగాకురా మా అన్నయ్య' సాంగ్ వింటానని, అది తనలో ఎంతో శక్తిని తీసుకువస్తుందని తెలిపాడు. దీంతో పంజాబ్‌పై నితీశ్ రెడ్డి ఊచకోతకు పవన్ కల్యాణ్ కారణమంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.