Rohit Sharma: ఐపీఎల్ 2024 సీజన్ ప్లేఆఫ్స్ దిశగా ముంబై ఇండియన్స్ మరో అడుగు ముందుకేసింది. పంజాబ్ కింగ్స్‌తో తలపడిన మ్యాచ్‌లో ఘన విజయాన్ని సాధించింది. తన చివరి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 20 పరుగుల తేడాతో ఓడిపోయి డీలా పడ్డ ముంబై ఇండియన్స్‌కు ఈ గెలుపు ఊపిరిపోసినట్టయింది.
పంజాబ్ ముల్లాన్‌పూర్ స్టేడియంలో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలల్లో ఏడు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ టాప్ స్కోరర్. 53 బంతుల్లో మూడు సిక్సర్లు, ఏడు బుల్లెట్ల వంటి ఫోర్లతో 78 పరుగులు బాదాడు.

ఓపెనర్ రోహిత్ శర్మ- 36, మిడిలార్డర్‌లో తిలక్ వర్మ- 34 పరుగులతో సత్తా చాటారు. ఈ ముగ్గురి విజృంభణకు ముంబై ఇండియన్స్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్.. అసమాన పోరాట పటిమను ప్రదర్శించింది. 14 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయిన దశ నుంచి 183 పరుగులు చేయగలిగిందంటే ఏ స్థాయిలో ప్రతిఘటించిందో అర్థం చేసుకోవచ్చు.
లోయర్ ఆర్డర్ బ్యాటర్ అశుతోష్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడీ మ్యాచ్‌లో. ముంబై బౌలర్లను బెంబేలెత్తించాడు తన భారీ షాట్లతో. 28 బంతులను ఎదుర్కొన్న అశుతోష్ ఇన్నింగ్‌లో ఏకంగా ఏడు భారీ సిక్సర్లు నమోదయ్యాయి. 28 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. ఒకదశలో పంజాబ్ కింగ్స్ గెలిచేలా కనిపించింది. చివరి ఓవర్లల్లో బ్యాటర్లు ఒత్తిడికి గురి కావడంతో పంజాబ్‌కు పరాజయం తప్పలేదు.
కాగా- ఈ మ్యాచ్‌లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. 12వ ఓవర్‌లో రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో సామ్ కుర్రన్ వేసిన ఓ బంతి అతన్ని గాయపరిచింది. కుర్రన్ వేసిన ఆ ఓవర్ రెండో బంతిని ఆఫ్ సైడ్ దిశగా స్వీప్ చేయబోయాడు రోహిత్ శర్మ. టైమింగ్ మిస్ అయ్యాడు.
వేగంగా దూసుకొచ్చిన ఆ డెలివరీ పిచ్ అయి నేరుగా రోహిత్ శర్మ కుడి భుజానికి బలంగా తాకింది. దీనితో కొద్దిసేపు క్రీజ్‌లోనే కూర్చుండి పోయాడు హిట్ మ్యాన్. మెల్లిగా పైకి లేచాడు. దీన్ని చూసిన కుర్రన్.. రోహిత్ శర్మ వద్దకు చేరుకుని అతన్ని పలకరించాడు. భుజంపై చెయ్యివేసి ఓదార్చాడు.