For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ : అందుకే పృథ్వీ షాను తీసుకోలేదు - పంత్

ఐపీఎల్ 17వ సీజన్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. సొంతమైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సీజన్‌ను విజయంతో ప్రారంభించాలని ఇరు జట్లు కసిగా బరిలోకి దిగుతున్నాయి. ఈ సారి అయినా కప్ కలను అందుకోవాలని తొలి పోరుకు సిద్ధమయ్యాయి. అయితే అందరి చూపు రిషబ్ పంత్‌పైనే ఉంది. 453 రోజుల తర్వాత పంత్ తిరిగి పోటీ క్రికెట్ ఆడుతున్నాడు. అంతేగాక ఢిల్లీ జట్టును అతడే తిరిగి నడిపిస్తున్నాడు.

మరోవైపు శిఖర్ ధావన్ తన అనుభవంతో ఢిల్లీపై పైచేయి సాధించాలని వ్యూహాలు రచిస్తున్నాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. నూతనంగా నిర్మించిన ఈ స్టేడియంలో ఛేదన అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పాడు. ముల్లాన్పూర్‌లో ఉన్న ఈ మహరాజ యాదవీంద్ర సింగ్ స్టేడియం తమకు అదృష్టాన్ని తీసుకువస్తుందని ధావన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

IPL 2024 PBKS vs DC That is why the Indian bowler was not included in the team XI - Rishabh Pant

అనంతరం రిషభ్ పంత్ రీఎంట్రీ గురించి మాట్లాడుతూ.. భావోద్వేగంతో ఉన్నానని చెప్పాడు. ఈ క్షణాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాని అన్నాడు. అయితే అతిగా ఆలోచించట్లేదని, గత సీజన్ గురించి పట్టించుకోట్లేదని తెలిపాడు. టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునే వాళ్లమని, పిచ్ స్లోగా కనిపిస్తుందని పంత్ పేర్కొన్నాడు. టీమిండియా బౌలర్ ముకేశ్ కుమార్‌ను సబ్‌స్టిట్యూట్‌గా పంత్ ప్రకటించాడు. ఇషాంత్ శర్మను జట్టులో తీసుకున్నాడు.

విదేశీ ప్లేయర్ల స్థానాల్లో డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టబ్స్, షై హోప్‌కు అవకాశం ఇచ్చినట్లు పంత్ తెలిపాడు. మరోవైపు పృథ్వీ షాకు అవకాశం ఇవ్వలేదు. రికీ భుయ్‌కు ఛాన్స్ ఇవ్వడం కోసం అతన్ని పక్కన పెట్టారు.

ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, షై హోప్, రిషబ్ పంత్, రికీ భుయ్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ

పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, సామ్ కరన్, లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ, శశాంక సింగ్, హ‌ర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, రాహుల్ చాహర్మ, అర్షదీప్ సింగ్.

Story first published: Saturday, March 23, 2024, 15:30 [IST]
Other articles published on Mar 23, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+