Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: ఈ అడ్డు తొలగితేనే ముంబైకు ఆరో టైటిల్

ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో ముంబై ఇండియన్స్ ఒకటి. వేలంలో వ్యూహాలు, ఆటగాళ్లను సూపర్ స్టార్లగా మార్చడంలో ప్రణాళికలు, సాహసోపేతమైన నిర్ణయాలతో గతకొన్నేళ్లుగా ముంబై విజయబాటలో పయనిస్తోంది. అయిదు టైటిళ్లు సాధించి చెన్నై సూపర్ కింగ్స్‌తో అత్యధిక ట్రోఫీలు అందుకున్న జట్టుగా నిలిచింది.

మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న 17వ సీజన్‌లో ఆరో టైటిల్‌పై ముంబై ఇండియన్స్ కన్నేసింది. సీజన్ ఆరంభానికి ముందే ట్రోఫీ కోసం పనులు మొదలుపెట్టింది. వేలంలో కావాలనుకున్న ఆటగాళ్లను సొంతం చేసుకుంది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య‌ను ట్రేడ్ చేసుకుంది. అంతేగాక జట్టు భవిష్యత్ కోసం కెప్టెన్‌ను మార్చింది. రోహిత్ శర్మను కాదని హార్దిక్‌కు సారథి బాధ్యతలు అందించింది.

IPL 2024: Mumbai Indians will win the sixth title only if this hurdle is removed

2020 సీజన్ వరకు ముంబై‌తో మ్యాచ్ అంటే ప్రత్యర్థి జట్టు ప్రత్యేక ప్రణాళికలు రచించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ముంబై తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతుంది. 2021, 2022లో ప్లేఆఫ్స్‌కు కూడా అర్హత సాధించలేకపోయింది. 2022 సీజన్‌లో దారుణమైన ప్రదర్శనతో పాయింట్ల టేబుల్‌లో అట్టడుగున నిలిచింది. గతేడాది ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించి ఫర్వాలేదనిపించింది.

అందుకే ఫ్రాంచైజీ.. జట్టు కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముంబైకి మునపటి వైభవాన్ని తీసుకురావాలని దూకుడైన నిర్ణయాలు తీసుకుంది. విదేశీ ఫాస్ట్ బౌలర్లు, భారత ఆల్‌రౌండర్, స్పిన్నర్ బ్యాకప్ ప్లేయర్లు లేకపోవడం ముంబై ప్రధాన సమస్యగా గతంలో ఉండేది. కానీ వేలంలో, ట్రేడింగ్‌లో ఆ సమస్యను తొలగించుకుంది. దక్షిణాఫ్రికా యువ సంచలనం గెరాల్డ్ కొయెట్జీని తీసుకుంది. శ్రీలంక పేసరలు నువాన్ తుషారా, ముధశంకను వేలంలో సొంతం చేసుకుంది. హార్దిక్ పాండ్య, మహ్మద్ నబీ, శ్రేయస్ గోపాల్‌ రాకతో అన్ని విభాగాల్లో తిరిగి పటిష్టంగా మారింది.

అయినప్పటికీ ముంబై ఆరో టైటిల్ సాధించడానికి ఓ సమస్య అడ్డుపడుతుంది. ముంబై ఇండియన్స్‌లో అంతర్యుద్ధం నెలకొందని కథనాలు వస్తున్నాయి. కెప్టెన్సీ మార్పుతో జట్టు రెండు వర్గాలుగా చీలిపోయిందని వార్తలు చక్కర్లుకొడుతున్నాయి. ఒకవేళ ఈ ప్రచారం నిజమైతే ముంబైకు కష్టాలు తప్పవు. కలిసికట్టుగా బరిలోకి దిగితేనే ముంబై మరో టైటిల్ సాధించగలదు.

ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్య (కెప్టెన్), రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ టెండూల్కర్, షామ్స్ ములానీ, నెహాల్ వధేరా, జస్‌ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ, పీయూష్ చావ్లా, ఆకాష్ మధ్వాలా , జాసన్ బెహ్రెండోర్ఫ్, రొమారియో షెపర్డ్, నువాన్ తుషార, అన్షుల్ కాంబోజ్, నమన్ ధీర్, శ్రేయస్ గోపాల్, దిల్షన్ మధుశంక, గెరాల్డ్ కోయెట్జీ, మహ్మద్ నబీ, శివాలిక్ శర్మ.

Story first published: Friday, March 1, 2024, 16:31 [IST]
Other articles published on Mar 1, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+