మరో రెండు రోజుల్లో క్రికెట్ పండగ మొదలుకానుంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. రెండు నెలలపాటు సాగే ఈ మెగాలీగ్ ఆరంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ప్రత్యర్థుల్లా ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లి తలపడే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచమంతా ఎదురుచూస్తోంది.
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ టికెట్లకు ఫుల్ క్రేజ్ ఏర్పడింది. సెలబ్రెటీలు సైతం తమకు టికెట్లు దొరకట్లేదని సోషల్ మీడియాలో తమ బాధను పంచుకుంటున్నారు. రవిచంద్రన్ అశ్విన్ సీఎస్‌కేను కూడా రిక్వెస్ట్ చేశాడు. కాగా, ఈ పోరు కోసం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సన్నద్ధమవుతున్నాడు.

ప్రాక్టీస్‌లో ధనాధన్ షాట్లతో మునపటి ధోనీని గుర్తుచేస్తున్నాడు. ఫాస్ట్ బౌలింగ్‌లో హెలికాఫ్టర్ షాట్లతో మహీ విరుచుకుపడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. గత ఐపీఎల్ సీజన్ నుంచి ఆటకు దూరమైనా ధోనీ ఫామ్‌లో ఉన్నాడని సీఎస్‌కే అభిమానులు సంతోషంలో మునిగిపోతున్నారు.
42 ఏళ్ల ధోనీ గతేడాది మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. అనంతరం శరీరానికి విశ్రాంతి ఇచ్చిన ధోనీ గత మూడు నెలల నుంచి కసరత్తులు మొదలుపెట్టాడు. తిరిగి బ్యాటును పట్టి ప్రాక్టీస్ కొనసాగిస్తున్నాడు. 2023 సీజన్‌లో ధోనీ తన మార్క్ ఫినిషిర్ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయినా కెప్టెన్‌గా సత్తాచాటాడు. సీఎస్‌కేకే అయిదో టైటిల్ అందించాడు.
అయితే ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభంకాక ముందే చెన్నైకు వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ఆటగాళ్లు గాయపడ్డారు. ఈ సీజన్‌లో తమ కొందరు ప్లేయర్లు పాల్గొనడంపై అనిశ్చితి నెలకొంది. డెవాన్ కాన్వే, మతీషా పతిరన ఆడటం అనుమానంగా మారింది. మరోవైపు చెన్నైకి శివమ్ దూబె చేరుకున్నప్పటికీ అతడు ప్రారంభమ్యాచ్‌ల్లో ఆడటంపై స్పష్టత లేదు. అయితే ముస్తాఫిజుర్ రెహ్మాన్ కోలుకోవడం సీఎస్‌కే కాస్త ఊరటనిస్తోంది.
చెన్నై సూపర్ కింగ్స్: ఎంఎస్ ధోనీ (కెప్టెన్), మొయిన్ అలీ, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, శివమ్ దూబె, రుతురాజ్ గైక్వాడ్, రాజవర్ధన్ హంగర్గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ మండల్, ముకేశ్ చౌదరి, అజింక్య రహానె, షేక్ రషీద్, మిచెల్ శాంట్నర్, సిమర్‌జీత్ సింగ్‌నెర్, నిశాంత్ సింధు, ప్రశాంత్ సోలంకి, మహీష్ తీక్షణ, రచిన్ రవీంద్ర, శార్దూల్ ఠాకూర్, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, ముస్తాఫిజుర్ రెహ్మన్, అవనీష్ రావు అరవెల్లి.