Mitchell Starc: ఐపీఎల్ 2024 సీజన్‌లో కోల్‌కత నైట్ రైడర్స్ దుమ్ము లేపుతోంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లల్లో ఘన విజయాలను సాధించింది. టీమ్ ఏదైనా, గ్రౌండ్ ఎక్కడైనా.. సేమ్ రిజల్ట్. ప్రత్యర్థిని మట్టికరిపించిండమే. నాలుగు పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ టాప్‌లో కొనసాగుతోంది.
తన హోమ్ గ్రౌండ్ కోల్‌కతలో ఆడిన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది కేకేఆర్. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్.. నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసిన విషయం తెలిసిందే. అనంతరం సన్‌రైజర్స్‌ను 204 పరుగులకే కట్టడి చేశారు కోల్‌కత బౌలర్లు.

ఆండ్రీ రస్సెల్ ఆల్‌రౌండర్ ప్రతిభకు అద్దం పట్టిన మ్యాచ్ అది. తొలుత బ్యాట్‌తో అనంతరం బంతితో చెలరేగాడు. 25 బంతుల్లో ఏడు సిక్సర్లు, మూడు ఫోర్లతో 64 పరుగుల చేసి నాటౌట్‌గా నిలిచిన రస్సెల్.. ఆ తరువాత బంతితోనూ నిప్పులు చెరిగాడు. రెండు వికెట్లు కూల్చాడు. హర్షిత్ రాణా మూడు వికెట్ల పడగొట్టాడు. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ ఒక్కో వికెట్ తీశారు.
ఆ మ్యాచ్‌లో మిఛెల్ స్టార్క్ వికెట్‌లెస్‌గా మారాడు. నాలుగు ఓవర్లల్లో 53 పరుగులు ఇచ్చిన మిఛెల్.. ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. రెండో మ్యాచ్‌లోనూ అతని ఫెయిల్యూర్ కంటిన్యూ అయిన విషయం తెలిసిందే. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్‌ను ఓడించింది.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 182 పరుగులు చేసింది. కోల్‌కత బౌలర్లు సునీల్ నరైన్- 1, హర్షిత్ రాణా, ఆండ్రీ రస్సెల్ రెండు చొప్పున వికెట్లు తీసుకున్నారు. ఇక్కడ కూడా మిఛెల్ స్టార్క్ ఘోరంగా విఫలం అయ్యాడు. ఒక్క వికెట్ కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 47 పరుగులు ఇచ్చుకున్నాడు.
మొత్తంగా రెండు మ్యాచ్‌లల్లో ఎనిమిది ఓవర్లల్లో 100 పరుగులు ఇచ్చాడు స్టార్క్. ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు. ఇది అతనిపై ట్రోల్స్‌కు తెర తీసింది. ముఫద్దల్ వోహ్రా అనే ఎక్స్ యూజర్ పెట్టిన ఓ ట్వీట్‌కు ఏకంగా ఐస్‌లాండ్ క్రికెట్ బోర్డ్ రియాక్ట్ అయింది. ఈ రెండు మ్యాచ్‌లల్లో మిఛెల్ ఇచ్చిన పరుగులు ఐస్‌ల్యాండ్‌లో దొరికే బీర్ రేట్ కంటే ఎక్కువ అంటూ సింగిల్ లైనర్ సెటైర్ సంధించింది.