Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పట్టాలెక్కిన ముంబై ఎక్స్‌ప్రెస్‌: ఆర్సీబీకి వరుసగా నాలుగో ఓటమి పొంచివుందా?

MI vs RCB: ఐపీఎల్ 2024లో మరో హోరాహోరీ పోరు చూడబోతోన్నాం. నేడు ముంబై ఇండియన్స్‌తో వాళ్ల సొంతగడ్డపై ఎదుర్కొనబోతోంది వీర కన్నడిగ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ సాయంత్రం 5:30 గంటలకు ముంబైలోని వాంఖెడే స్టేడియం దీనికి వేదిక.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఈ మ్యాచ్ గెలిచి తీరాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు ఆడిన అయిదు మ్యాచ్‌లల్లో ఈ జట్టు గెలిచింది ఒక్కటంటే ఒక్కటే. నాలుగింట్లో ఓడింది. వరుసగా మూడు ఓటములతో హ్యాట్రిక్ సైతం కొట్టిందీ బెంగళూరు జట్టు. ప్రస్తుతం ఈ జట్లు ఖాతాలో ఉన్నవి రెండు పాయింట్లు మాత్రమే. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.

IPL 2024 MI vs RCB Can Royal Challengers Bengaluru end its losing streak tonight

తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో ఓడిపోయిన అనంతరం పంజాబ్ కింగ్స్‌పై ఘన విజయాన్ని సాధించింది. ఆర్సీబీ ఈ సీజన్‌లో ఇప్పటివరకు గెలిచిన మ్యాచ్ ఏదైనా ఉందంటే అదొక్కటే. అనంతరం కోల్‌కత నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్‌పై వరుస ఓటములను చవి చూసింది. ముంబై ఇండియన్స్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో గెలిస్తే కొంత పరువు కాపాడుకున్నట్టవుతుంది.

ముంబై ఇండియన్స్ పరిస్థితి కూడా ఇట్లాగే ఉంది. రాయల్ ఛాలెంజర్స్‌కు భిన్నంగా ఏమీ లేదు. మొన్నటి వరకు ముంబై ఇండియన్స్ కూడా వరుస ఓటములతో కుదేల్ అయిన జట్టే. ఆడిన తొలి మూడింట్లో ఓడిపోయి ఆ జట్టు కూడా హ్యాట్రిక్ కొట్టింది రాయల్ ఛాలెంజర్స్ తరహాలోనే. ఎట్టకేలకు ఢిల్లీ కేపిటల్స్‌పై గెలిచింది. విన్నింగ్ ట్రాక్ ఎక్కింది.

ఢిల్లీపై 234 పరుగులను చేసింది ముంబై ఇండియన్స్. ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం ఫుల్ ఫామ్‌లోకి వచ్చినట్టే కనిపించిందా మ్యాచ్‌లో. ఆర్సీబీతో జరిగే మ్యాచ్‌లో కూడా దాన్ని కొనసాగిస్తుందా? లేక ఢిల్లీ కేపిటల్స్‌పై సాధించిన గెలుపు గాలివాటమేనని ప్రూవ్ చేసుకుంటుందా అనేది ఈ రాత్రికి తేలిపోతుంది.

ముంబై ఇండియన్స్‌పై ఆర్సీబీకి మంచి ట్రాక్ రికార్డే ఉంది. చివరి అయిదు మ్యాచ్‌లల్లో ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడింది. మిగిలిన నాలుగింట్లో విజయం సాధించింది. చివరి అయిదింట్లో తొలి మ్యాచ్‌లో 2 వికెట్లు, రెండోదాంట్లో 54 పరుగులు, మూడో గేమ్‌లో ఏడు వికెట్లు, ఆ తరువాతతి మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లతో ముంబైని ఓడించింది. అయిదో మ్యాచ్‌లో మాత్రం ఆరు వికెట్లతో ఓడింది.

Story first published: Thursday, April 11, 2024, 11:12 [IST]
Other articles published on Apr 11, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+