For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎలాగూ ప్లేఆఫ్స్‌కు వెళ్లట్లేదు కాబట్టి.. ఆ పని చేయండి

Jasprit Bumrah: ఐపీఎల్ 2024 సీజన్‌‌లో వరుస పరాజయాలతో ముంబై ఇండియన్స్‌ కుదేల్ అవుతోంది. తన స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించట్లేదీ మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్. గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లన్నింట్లోనూ చతికిలపడుతూ వస్తోంది. ఫలితంగా ప్లేఆఫ్స్‌ చేరే అవకాశాలను చేతులారా మట్టిపాలు చేసుకుంది.

ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌లల్లో ఓడినవే ఎక్కువ. మూడింట్లో గెలిచింది. ఎనిమిది మ్యాచ్‌లల్లో ఘోర పరాజయాన్ని చవి చూసింది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో ఉన్నవి ఆరు పాయింట్లే. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఆ జట్టుకు ఉన్న ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు జీరో.

IPL 2024 MI vs KKR Wasim Jaffer asked Mumbai Indians to rest Jasprit Bumrah for T20 World Cup 2024

తాజాగా కోల్‌కత నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పరాభవమే ఎదురైంది హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ టీమ్‌కు. శుక్రవారం రాత్రి వాంఖెడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 24 పరుగుల తేడాతో ఓటమిని చవి చూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 19.5 ఓవర్లల్లో 169 పరుగులకు ఆలౌట్ అయింది.

ఈ స్కోర్‌ను ఛేజ్ చేయడంలో అట్టర్ ఫ్లాప్ అయింది ముంబై ఇండియన్స్. 18.5 ఓవర్లల్లో 145 పరుగులకు చాప చుట్టేసింది. టాప్ ఆర్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే టాప్ స్కోరర్. 35 బంతుల్లో 56 పరుగులు చేశాడు. టిమ్ డేవిడ్ కొంత వరకు నిప్పులు చెరుగుతున్న కేకేఆర్ బౌలర్లను ప్రతిఘటించగలిగాడు. మిగిలిన బ్యాటర్లందరూ దారుణంగా విఫలం అయ్యారు.

ఈ ఓటమిపై టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ స్పందించాడు. ఎలాగూ ప్లేఆఫ్స్‌కు వెళ్లట్లేదు కాబట్టి- ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని సూచించాడు. ఇంకో నెల రోజుల వ్యవధిలో టీ20 వరల్డ్ కప్ 2024 ఆడాల్సి ఉన్నందున.. బుమ్రా రెస్ట్ ఇవ్వాలని ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్‌కు విజ్ఞప్తి చేశాడు.

ఈ కొద్దిరోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే టీమిండియాకే మంచిదని అభిప్రాయపడ్డాడు. విశ్రాంతి తీసుకున్న అనంతరం బుమ్రా టీ20 వరల్డ్ కప్‌లో సత్తా చాటడానికి వీలు కలుగుతుందని పేర్కొన్నాడు. ఏకధాటిగా క్రికెట్ ఆడటం వల్ల బుమ్రా అలసటకు గురి అవ్వొచ్చని, దాని ప్రభావం టీ20 వరల్డ్ కప్ పడితే ఇబ్బందులను కోరి తెచ్చుకున్నట్టవుతుందని అన్నాడు.

టీ20 వరల్డ్ కప్ ఆడబోయే జట్టులో ప్రధాన బౌలర్ బుమ్రానే. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్‌తో కూడిన బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌ను అతనే లీడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఐపీఎల్ మ్యాచ్‌ల వల్ల అతను మానసికంగా ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉండొచ్చని, విశ్రాంతి ఇస్తే జట్టుకు మంచిదని చెప్పాడు వసీం జాఫర్.

Story first published: Saturday, May 4, 2024, 13:25 [IST]
Other articles published on May 4, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+