Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందరి కంటే ముందే అస్సాం ట్రైన్ ఎక్కేశారు..!!

IPL 2024 Mumbai Indians Playoffs chances: ఐపీఎల్ 2024 సీజన్‌‌లో వరుస పరాజయాలతో ముంబై ఇండియన్స్‌ కుదేల్ అవుతోంది. తన స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించట్లేదీ మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్. గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లన్నింట్లోనూ చతికిలపడుతూ వస్తోంది. ఫలితంగా ప్లేఆఫ్స్‌ చేరే అవకాశాలను చేతులారా మట్టిపాలు చేసుకుంది.

ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌లల్లో ఓడినవే ఎక్కువ. మూడింట్లో గెలిచింది. ఎనిమిది మ్యాచ్‌లల్లో ఘోర పరాజయాన్ని చవి చూసింది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో ఉన్నవి ఆరు పాయింట్లే. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఆ జట్టుకు ఉన్న ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు జీరో.

IPL 2024 MI vs KKR Mumbai Indians Playoffs chances almost washed out after defeat by KKR

తన చివరి నాలుగు మ్యాచ్‌లల్లోనూ ఓడింది ముంబై ఇండియన్స్. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ కేపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్.. తాజాగా కోల్‌కత నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లల్లో పరాజయం పాలైంది. కిందటి నెల 18వ తేదీన చివరిసారిగా మ్యాచ్ గెలిచింది హార్దిక్ సేన. ఆ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. అంతే- అప్పటి నుంచి గెలుపు రుచి చూడట్లేదు.

ప్రస్తుతం ముంబై ఇండియన్స్ చేతిలో ఇంకో మూడు మ్యాచ్‌లు మాత్రమే మిగిలాయి. తొలుత సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడాల్సి ఉంది. అనంతరం కోల్‌కత నైట్‌రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ మూడుకు మూడు గెలిచినా 12 పాయింట్ల వద్దే నిలిచిపోతుందా జట్టు ప్రస్థానం.

ఈ మూడింటినీ భారీ రన్‌రేట్‌తో గెలిచినప్పటికీ- ఇతర జట్ల గెలుపోటములు, నెట్ రన్‌రేట్ మీద ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ఇప్పుడున్న ఫామ్‌ను బట్టి చూస్తే- ముంబై ఇండియన్స్‌తో చివరి మూడు మ్యాచ్‌లల్లో తలపడే జట్లు బలమైనవే. టాప్ గేర్‌లో ఉన్నవే.

పైగా లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఇప్పటికే 12 పాయింట్లను తమ ఖాతాలో వేసుకున్నాయి. ఇంకా నాలుగేసి మ్యాచ్‌లు ఈ రెండు జట్ల చేతిలో ఉన్నాయి. వీటిల్లో ఏ రెండు గెలిచినా టోర్నమెంట్‌లో ముందడుగు వేయగలుగుతాయి. ఈ పరిస్థితుల్లో ముంబైకి ఉన్న ప్లేఆఫ్స్ అవకాశాలు 0.0006 శాతం మాత్రమే.

తాజాగా కోల్‌కత నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పరాభవమే ఎదురైంది హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ టీమ్‌కు. శుక్రవారం రాత్రి వాంఖెడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 24 పరుగుల తేడాతో ఓటమిని చవి చూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 19.5 ఓవర్లల్లో 169 పరుగులకు ఆలౌట్ అయింది.

ఈ స్కోర్‌ను ఛేజ్ చేయడంలో అట్టర్ ఫ్లాప్ అయింది ముంబై ఇండియన్స్. 18.5 ఓవర్లల్లో 145 పరుగులకు చాప చుట్టేసింది.టాప్ ఆర్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే టాప్ స్కోరర్. 35 బంతుల్లో 56 పరుగులు చేశాడు. టిమ్ డేవిడ్ కొంత వరకు నిప్పులు చెరుగుతున్న కేకేఆర్ బౌలర్లను ప్రతిఘటించగలిగాడు. మిగిలిన బ్యాటర్లందరూ దారుణంగా విఫలం అయ్యారు.

Story first published: Saturday, May 4, 2024, 9:20 [IST]
Other articles published on May 4, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+