Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: ముంబై బోణీ..పోరాడిన ఢిల్లీ

ఐపీఎల్ 17వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. హ్యాట్రిక్ ఓటముల తర్వాత విజయాన్ని అందుకుంది. వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో నెగ్గింది.తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 234 పరుగులు చేసింది.

రోహిత్ శర్మ (49; 27 బంతుల్లో, 6x4, 3x6), ఇషాన్ కిషన్ (42; 23 బంతుల్లో, 4x4, 2x6), టిమ్ డేవిడ్ (45*; 21 బంతుల్లో, 2x4, 4x6) సత్తాచాటారు. ఆఖర్లో షెఫార్డ్ (39*; 10 బంతుల్లో, 3x4, 4x6) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అనంతరం ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ట్రిస్టన్ స్టబ్స్ (71*; 25 బంతుల్లో, 3x4, 7x6) గొప్పగా పోరాడాడు.

IPL 2024 MI vs DC Mumbai Indians Secure Victory Over Delhi Capitals by 29 Runs

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు పేలవారంభం లభించింది. 22 పరుగులకే ఢిల్లీ మొదటి వికెట్ కోల్పోయింది. డేవిడ్ వార్నర్ (10; 8 బంతుల్లో, 1x4, 1x6)ను షెఫార్డ్ ఔట్ చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన అభిషేక్ పోరెల్ (41; 31 బంతుల్లో, 5x4)తో కలిసి పృథ్వీ షా (66; 40 బంతుల్లో, 3x4, 4x6) ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. తొలుత నిదానంగా ఆడిన పృథ్వీ తర్వాత గేర్ మార్చాడు. 31 బంతుల్లో అర్ధశతకం అందుకున్నాడు. అభిషేక్‌తో కలిసి రెండో వికెట్‌కు 49 బంతుల్లో 88 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

అయితే ప్రమాదకరంగా మారుతున్న పృథ్వీని బుమ్రా అద్భుతమైన యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు. కాసేపటికే అభిషేక్‌ను కూడా బుమ్రా ఔట్ చేసి ఢిల్లీని దెబ్బకొట్టాడు. ఆ తర్వాత స్టబ్స్ ఓటమిని అంగీకరించలేదు. బౌండరీలు, సిక్సర్లతో క్రమంగా లక్ష్యాన్ని కరిగించాడు. కానీ సహచరుల నుంచి సహకారం లభించకపోవడంతో జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. నాలుగు ఓవర్లు వేసిన బుమ్రా 22 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. కొయెట్జీ 34 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌‌కు శుభారంభం దక్కింది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ తొలి వికెట్‌కు ఏడు ఓవర్లలో 80 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆది నుంచే వీరిద్దరు దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో ముంబై పవర్‌ప్లేలో ఏకంగా 75 పరుగులు సాధించింది. కానీ ఆ తర్వాత ఢిల్లీ బౌలర్లు పుంజుకుని ముంబై స్కోరును కట్టడిచేశారు.

7 ఓవర్లకు 80/0తో ఉన్న ముంబై 12.4 ఓవర్లకు 121/4తో నిలిచింది. కానీ టిమ్ డేవిడ్‌‌ బౌండరీలు సాధిస్తూ స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. ఆఖర్లో డేవిడ్‌కు షెఫార్డ్ జతకావడంతో ముంబై భారీ స్కోరు సాధించింది.నోకియా వేసిన ఆఖరి ఓవర్‌లో షెఫార్డ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరుసగా 4, 6, 6, 6, 4, 6 బాదాడు. దీంతో 20వ ఓవర్‌లో ఏకంగా 32 పరుగులు వచ్చాయి. చివరి నాలుగు ఓవర్లలో 84 పరుగులు సాధించింది.

Story first published: Sunday, April 7, 2024, 19:23 [IST]
Other articles published on Apr 7, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+