Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సూర్య వచ్చాడు.. జట్టులో భారీ మార్పులు చేశాం- హార్దిక్ పాండ్య

ఐపీఎల్ 17వ సీజన్ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి బోణీ కొట్టాలని ముంబై పట్టుదలతో బరిలోకి దిగుతోంది. ఈ సీజన్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన ముంబై మూడింట్లో పరాజయాన్ని చవిచూసింది.

అయితే తమ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ రాకతో జట్టులో కొత్త ఉత్సాహం ఏర్పడింది. అదే జోరులో గెలుపు బాట పట్టాలని ముంబై భావిస్తోంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఒకే విజయం సాధించింది. కేకేఆర్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 106 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. గత మ్యాచ్ పొరపాట్లను సరిద్దికుని ఈ మ్యాచ్‌లో సత్తాచాటాలని కసిగా ఢిల్లీ బరిలోకి దిగుతుంది.

IPL 2024 MI vs DC Hardik Announces Three Changes Surya Returns Replaces Naman

ఐపీఎల్‌లో ఢిల్లీపై ముంబైకు మెరుగైన రికార్డు ఉంది. 18 మ్యాచ్‌ల్లో ముంబై, 15 మ్యాచ్‌ల్లో ఢిల్లీ గెలిచింది. కాగా, టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ మాట్లాడుతూ తమ జట్టులో రెండు మార్పులు చేశామని తెలిపాడు. గాయం కారణంగా మిచెల్ మార్ష్ ఈ మ్యాచ్‌‌కు అందుబాటులో లేడని తెలిపాడు. జే రిచర్డ్సన్, లలిత్ యాదవ్ జట్టులోకి వచ్చారని పంత్ తెలిపాడు.

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య మాట్లాడుతూ.. జట్టులో మూడు మార్పులు చోటు చేసుకున్నాయని అన్నాడు. సూర్యకుమార్ యాదవ్ తిరిగొచ్చాడని చెప్పాడు. నమన్, క్వెనా మఫాక, బ్రెవిస్ జట్టుకు దూరమయ్యారని వాళ్ల స్థానంలో సూర్యకుమార్, మహ్మద్ నబీ, రొమారియో షెఫార్డ్ వచ్చారని తెలిపాడు.

జట్టు వివరాలు
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య (కెప్టెన్), తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, మహ్మద్ నబీ, షెఫార్డ్, గెరాల్డ్ కొయెట్జీ, జస్ప్రీత్ బుమ్రా, పీయష్ చావ్లా.

ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, అభిషేక్ పోరెల్, రిషభ్ పంత్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, జే రిచర్డ్సన్, అన్రిచ్ నోకియా, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్.

Story first published: Sunday, April 7, 2024, 15:17 [IST]
Other articles published on Apr 7, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+