For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2024: పాండ్యా ఇన్.. గ్రీన్ అవుట్.. ముంబై రిలీజ్ చేసిన ప్లేయర్ల లిస్ట్ ఇదే!

ఐపీఎల్ 2024 ముందు ముంబై ఇండియన్స్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. మినీవేలానికి ముందు కొందరు కీలకమైన ఆటగాళ్లను రిలీజ్ చేసి అందరికీ షాకిచ్చింది. గతేడాది మినీ వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన ఆసీస్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను ఆర్సీబీకి ట్రేడ్ ద్వారా అమ్మేసింది. పూర్తి క్యాష్‌కు అతన్ని ట్రేడ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం చూసి అందరూ షాకైనా.. దానికి పెద్ద కారణమే ఉంది.

గ్రీన్ ట్రేడింగ్ ద్వారా వచ్చిన సొమ్ముతో.. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్, మాజీ ముంబై ప్లేయర్ హార్దిక్ పాండ్యాను తిరిగి జట్టులోకి తీసుకుంది. అతని రీఎంట్రీతో ముంబై ఫ్యాన్స్ అందరూ చాలా సంతోషిస్తున్నారు. అంతేకాదు, ఎంతో ఖర్చు పెట్టి కొనుగోలు చేసిన ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌ను కూడా ముంబై రిలీజ్ చేసేసింది. గత రెండు సీజన్లుగా ఆర్చర్ పెద్దగా ఐపీఎల్ ఆడని సంగతి తెలిసిందే.

IPL 2024 MI Released and Retained players ahead of mini auction

గాయంతో కొంత కాలంగా ఇబ్బంది పడుతూ వచ్చిన ఆర్చర్.. ఈ ఏడాది ఆడేలాగే కనిపించాడు. అయితే కేవలం రెండు, మూడు మ్యాచులే ఆడిన ఆర్చర్ పెద్దగా ప్రభావం చూపలేదు కూడా. అందుకే అతనికి వీడ్కోలు పలికేయాలని ముంబై డిసైడ్ అయింది. అలాగే ఝై రిచర్డ్‌సన్, క్రిస్ జోర్డాన్, ట్రిస్టియన్ స్టబ్స్ వంటి కీలక విదేశీ ప్లేయర్లను వదిలేసింది.

ఎంఐ రిలీజ్ చేసిన ప్లేయర్లు: మహహ్మద్ అర్షద్ ఖాన్, రమణ్‌దీప్ సింగ్, హృతిక్ షోకీన్, రాఘవ్ గోయల్, జోఫ్రా ఆర్చర్, ట్రిస్టియన్ స్టబ్స్, డువాన్ యాన్సెన్, ఝై రిచర్డ్‌సన్, రైలీ మెరెడిత్, క్రిస్ జోర్డాన్, సందీప్ వారియర్

ఎంఐ రిటైన్ చేసుకున్న ప్లేయర్లు: రోహిత్ శర్మ (కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ టెండూల్కర్, షామ్స్ ములనీ, నేహాల్ వధీర, జస్‌ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ, పీయూష్ చావ్లా, ఆకాష్ మధవాల్, జేసన్ బెహ్రెండాఫ్, రొమేరియో షెఫర్డ్ (లక్నో నుంచి), హార్దిక్ పాండ్యా (జీటీ నుంచి)

Story first published: Sunday, November 26, 2023, 20:30 [IST]
Other articles published on Nov 26, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+