Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హార్దిక్‌పై కోపంగా మలింగ.. కారణమదేనా? (Video)

ముంబై ఇండియన్స్ జట్టులో అంతర్గత విభేదాలు మరోసారి భయటపడ్డాయి. కెప్టెన్ హార్దిక్ పాండ్యతో ముంబై బౌలింగ్ కోచ్ లసిత్ మలింగ కోపంగా ఉన్నట్లు ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ అనంతరం ప్లేయర్ల షేక్ హ్యాండ్ సమయంలో హార్దిక్-మలింగ ఎడమోహం పెడమోహంగా వ్యవహరించారు. వారిద్దరు చిరునవ్వుతో పలకరించుకోలేదు.

అంతకుముందు బ్యాటింగ్‌కు సిద్ధమైన హార్దిక్ పాండ్య.. మలింగ, బ్యాటింగ్ కోచ్ పొలార్డ్ దగ్గరకు వచ్చాడు. అయితే కుర్చీ ఇవ్వమన్నట్లుగా హార్దిక్ వాళ్లతో ఏదో చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో పొలార్డ్ తన కుర్చీని ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. కానీ పొలార్డ్‌ను ఆపి మలింగ అక్కడ నుంచి సీరియస్‌గా వెళ్లిపోయాడు.

IPL 2024 Malinga is angry with Hardik Pandya after SRH vs MI match Is that the reason

అయితే మలింగ అలా వ్యవహరించడానికి కారణమేంటో స్పష్టంగా తెలియదు. కానీ ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సన్‌రైజర్స్ మ్యాచ్‌లో బౌలింగ్ కోచ్ అయిన తన అభిప్రాయాన్ని హార్దిక్ లెక్కచేయనందుకు మలింగ అసంతృప్తిగా ఉన్నాడని కొందరు అంటున్నారు. మరోవైపు హార్దిక్-రోహిత్ కెప్టెన్సీ గొడవ కారణమని, హిట్‌మ్యాన్‌కు మలింగ మద్దతు ఇస్తున్నాడని పేర్కొంటున్నారు.

కాగా, ఓ ప్రముఖ పత్రిక ముంబైలోని అంతర్గత విభేదాల గురించి సంచలన కథనం ప్రచురించింది. ముంబై జట్టు ప్రస్తుతం రెండు కూటములుగా విడిపోయాయని రాసింది. రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ‌తో పాటు కొందరు ఒక గ్రూప్‌గా ఉన్నారని, హార్దిక్ పాండ్య, ఇషాన్ కిషన్‌తో పాటు మరికొందరు మరో గ్రూప్‌గా విడిపోయారని పేర్కొంది. అయితే ముంబై ఫ్రాంచైజీ హార్దిక్‌కు మద్దతు ఇస్తుందని తెలిపింది.

ముంబై తమ తర్వాతి నాలుగు మ్యాచ్‌లు సొంతమైదానంలోనే ఆడనుంది. వాంఖడేలో ముంబై గెలుపు బాట పడుతుందని ఫ్రాంచైజీ భావిస్తోంది. వరుస విజయాలు సాధిస్తే జట్టులో విభేదాలు తొలగిపోతాయని ఆశిస్తోంది.కాగా, 523 పరుగులు నమోదైన ఉప్పల్ మ్యాచ్‌లో అంతిమంగా ముంబైపై హైదరాబాద్ 31 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

మొదట సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 277 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (62; 24 బంతుల్లో), అభిషేక్ శర్మ (63; 23 బంతుల్లో), మార్క్‌రమ్ (42*; 28 బంతుల్లో), క్లాసెన్ (80*; 34 బంతుల్లో) సత్తాచాటారు. అనంతరం ఛేదనలో ముంబై 20 ఓవర్లకు అయిదు వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది. తిలక్ వర్మ (64; 34 బంతుల్లో), టిమ్ డేవిడ్ (42*; 22 బంతుల్లో), ఇషాన్ కిషన్ (34; 13 బంతుల్లో) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

Story first published: Thursday, March 28, 2024, 13:30 [IST]
Other articles published on Mar 28, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+