ఐపీఎల్-2024లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. సొంతమైదానంలో పంజాబ్ కింగ్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఘనంగా బోణీ కొట్టాలని లక్నో పట్టుదలతో బరిలోకి దిగుతోంది. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో లక్నో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.
మరోవైపు ఈ లీగ్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ కింగ్స్ ఓ విజయం సాధించింది. ఢిల్లీపై గెలిచిన పంజాబ్ బెంగళూరు చేతిలో ఓటమిపాలైంది. లక్నోపై గెలిచి తిరిగి గెలుపు బాట పట్టాలని పంజాబ్ భావిస్తోంది.

ఐపీఎల్‌లో ఇప్పటివరకు లక్నో, పంజాబ్ మూడు సార్లు తలపడ్డాయి. లక్నో రెండు మ్యాచ్‌ల్లో, పంజాబ్ ఓ మ్యాచ్‌లో గెలిచింది. కాగా, లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే టాస్‌కు లక్నో తరఫున కేఎల్ రాహుల్ బదులుగా నికోలస్ పూరన్ వచ్చాడు. రాహుల్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగుతున్నట్లు లక్నో నయా కెప్టెన్ పూరన్ పేర్కొన్నాడు. ఇటీవల గాయం నుంచి కోలుకున్న రాహుల్‌పై పనిభారం తగ్గించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పూరన్ తెలిపాడు.
లక్నో సూపర్ జెయింట్స్ తుది జట్టు:
కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్, దేవదత్ పడికల్, నికోలస్ పూరన్, మార్కస్ స్టొయినిస్, కృనాల్ పాండ్య, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్, సిద్ధార్థ్
పంజాబ్ కింగ్స్ తుదిజట్టు:
శిఖర్ ధావన్ , జానీ బెయిర్‌స్టో, జితేష్ శర్మ, సామ్ కరన్, లివింగ్‌స్టోన్, శశాంక్ సింగ్, హర్షల్ పటేల్, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబాడ, రాహుల్ చాహర్