Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LSG vs PBKS: ఇదెక్కడి మాస్ రివెంజ్రా.. 6, 6, క్లీన్ బౌల్డ్ (Video)

లక్నో వేదికగా జరుగుతున్న లక్నో సూపర్ జెయింట్స్ - పంజాబ్ కింగ్స్‌ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 199 పరుగులు చేసింది.ఓపెనర్ డికాక్ (54; 38 బంతుల్లో, 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్య (43*; 22 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కొత్త కెప్టెన్ నికోలస్ పూరన్ (42; 21 బంతుల్లో, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) సత్తాచాటారు.

ఈ మ్యాచ్‌లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుని ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన కేఎల్ రాహుల్ (15; 9 బంతుల్లో) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. పంజాబ్ బౌలర్లలో సామ్ కరన్ మూడు, అర్షదీప్ సింగ్ రెండు వికెట్లు తీశారు. అయితే లక్నో ఇన్నింగ్స్‌లో ఆసక్తికర ఫైట్ చోటు చేసుకుంది.

IPL 2024 LSG vs PBKS Rahul Chahar and Marcus Stoinis fight was thrilling 6 6 and Out

మార్కస్ స్టొయినిస్, రాహుల్ చాహర్ మధ్య పోటాపోటీ వాతావరణం ఏర్పడింది. తొమ్మిదో ఓవర్‌లో వీరిద్దరు నువ్వానేనా అన్నట్లు పోటీపడ్డారు. రాహుల్ చాహర్ వేసిన తొలి బంతికి డికాక్ సింగిల్ తీసి స్టొయినిస్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. కాగా, రెండో బంతిని స్టొయినిస్ బౌలర్ తల మీదుగా సిక్సర్ బాదాడు. మూడో బంతిని స్క్వేర్ లెగ్ మీదుగా స్టాండ్స్‌కు తరలించాడు.

వరుసగా రెండు సిక్సర్లు స్టొయినిస్ బాదడంతో రాహుల్ చాహర్‌పై ఒత్తిడి ఏర్పడింది. కానీ ఆ తర్వాత బంతిని చాహర్ అద్భుతంగా వేశాడు. స్టొయినిస్‌ను బోల్తాకొట్టిస్తూ లెగ్ స్టంప్‌ను ఎగరగొట్టాడు. ఆ తర్వాత చాహర్ ఆవేశంగా సంబరాలు చేసుకున్నాడు. కాగా, ఐపీఎల్‌లో స్టొయినిస్‌కు రాహుల్ చాహర్ 39 బంతులు విసిరాడు. 78 పరుగులు సమర్పించుకుని రెండు సార్లు వికెట్ సాధించాడు. స్టొయినిస్ మూడు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు బాదాడు.

రాహుల్ చాహర్ - స్టొయినిస్ మధ్య సాగిన ఈ ఫైట్‌తో పంజాబ్ కింగ్స్- లక్నో సూపర్ జెయింట్స్ మరో మ్యాచ్ ఎప్పుడా అని ప్రేక్షుకులు ఆరాతీశారు. కానీ ఇరు జట్లు ఒకే గ్రూప్‌లో ఉండటంలో లీగ్ దశలో ఒక్క మ్యాచ్ మాత్రమే ఉంది. రెండు జట్లు ప్లేఆఫ్స్ అర్హత సాధిస్తేనే చాహర్, స్టొయినిస్ పోరును చూడటానికి అవకాశం ఉంటుంది.

Story first published: Saturday, March 30, 2024, 22:17 [IST]
Other articles published on Mar 30, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+