Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

David Miller: గుజరాత్ టైటాన్స్‌కు బిగ్ షాక్

David Miller: గుజరాత్ టైటాన్స్‌కు పరాజయాలు వీడట్లేదు. ఒక మ్యాచ్ గెలుపు, మరో మ్యాచ్‌లో ఓటమి అన్నట్లుగా సాగుతోంది ఆ జట్టు ప్రస్థానం. టైటిల్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగినప్పటికీ..ఆ స్థాయిలో ఆడట్లేదు. జట్టు సమష్టిగా రాణించట్లేదు. పంజాబ్ కింగ్స్‌పై బ్యాటర్లు సత్తా చాటినప్పటికీ- బౌలర్లు విఫలం అయ్యారు. 199 పరుగుల భారీ స్కోర్‌ను కాపాడుకోవడంలో విఫలం అయ్యారు.

అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో మట్టికరిపించింది గుజరాత్. మూడు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లల్లో 199 పరుగుల భారీ స్కోర్‌ను సాధించింది. 48 బంతుల్లో నాలుగు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 89 పరుగులు చేసిన కేప్టెన్ శుభ్‌మన్ గిల్.. టాప్ స్కోరర్.

IPL 2024 LSG vs GT David Miller is unavailable for a week or more days due to injury

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు.. ఇంకా ఒక్క బంతి మిగిలివుండగానే ఈ టార్గెట్‌ను కొట్టిపడేశారు. 19.5 ఓవర్లల్లో 200 పరుగులు చేశారు. రెండు వరుస ఓటముల తరువాత గుజరాత్ టైటాన్స్‌ను వారి సొంత గడ్డపై ఓడించారు. ప్రత్యేకించి- డెత్ ఓవర్లల్లో విజృంభించి ఆడారు.

గుజరాత్ జట్టులో ఆరుమంది ప్లేయర్లు బౌలింగ్ వేశారు. అందరూ వికెట్లు పడగొట్టారు గానీ ధారాళంగా పరుగులను ఇచ్చుకున్నారు. రషీద్ ఖాన్ వంటి స్టార్ బౌలర్ సైతం చేతులత్తేశాడీ మ్యాచ్‌లో. నాలుగు ఓవర్లల్లో ఒక వికెట్ మాత్రమే తీసుకున్న రషీద్ ఖాన్ 40 పరుగులు ఇచ్చాడు. ఉమేష్ యాదవ్‌దీ అదే పరిస్థితి.

ఈ నెల 7వ తేదీన తన తదుపరి మ్యాచ్‌ను ఆడబోతోంది గుజరాత్ టైటాన్స్. లక్నో సూపర్ జెంట్స్‌ను ఢీకొట్టబోతోంది వారి హోమ్ పిచ్‌పై. నాలుగు మ్యాచ్‌లల్లో మూడింట్లో విజయం సాధించింది దూకుడు మీద ఉంది కేఎల్ రాహుల్ సేన. తన చివరి రెండు మ్యాచ్‌లల్లో విజయఢంకా మోగించింది.

అలాంటి జట్టును ఎదుర్కొనబోతోన్న గుజరాత్ టైటాన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. మిడిలార్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్.. జట్టుకు దూరం అయ్యాడు. గాయం కారణంగా కనీసం నాలుగు మ్యాచ్‌లకు అతను అందుబాటులో ఉండే అవకాశాలు దాదాపుగా లేనట్టే. ఈ కారణంతోనే పంజాబ్ కింగ్స్‌పై మ్యాచ్‌లో కూడా మిల్లర్ ఆడని విషయం తెలిసిందే. అతనికి బదులుగా కేన్ విలియమ్పన్ జట్టులోకి వచ్చాడు.

Story first published: Friday, April 5, 2024, 15:27 [IST]
Other articles published on Apr 5, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+