MS Dhoni: ఐపీఎల్ 2024 టైటిల్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్.. వరుస విజయాలకు బ్రేక్ పడింది. వరుసగా రెండు మ్యాచ్‌లల్లో విజయదుందుభి మోగించిన ఈ జట్టు హ్యాట్రిక్‌పై కన్నేసినప్పటికీ.. అది సాధ్యపడలేదు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పరాజయాన్ని చవి చూసింది.
శుక్రవారం రాత్రి లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏక్నా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 40 బంతుల్లో ఒక సిక్స్, అయిదు ఫోర్లతో 57 పరుగులు చేశాడు.

ఓపెనర్ అజింక్య రహానె- 36, మొయిన్ అలీ- 30 పరుగులతో ఫర్వాలేదనిపించారు. చివర్లో మహేంద్రసింగ్ ధోనీ రఫ్ఫాడించాడు. 9 బంతులను మాత్రమే ఎదుర్కొన్న ధోనీ.. తనదైన స్టైల్‌లో ఇన్నింగ్‌ను ఫినిష్ చేశాడు. రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో 28 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
17.5 ఓవర్లల్లో జట్టు స్కోరు ఆరు వికెట్ల నష్టానికి 141 పరుగులు ఉన్నప్పుడు క్రీజ్‌లోకి వచ్చాడు మహీ. 9 బంతుల్లో 28 పరుగులను జత చేశాడు. జట్టు స్కోరును 170 పరుగులను దాటించాడు.
అనంతరం ఛేజింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్ మెరుపువేగంతో సాగింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్- 82, క్వింటన్ డికాక్- 54 పరుగులతో మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశారు. తొలి వికెట్ భాగస్వామ్యానికి 134 పరుగులు జోడించారు. అక్కడే సగం మ్యాచ్ గెలిచేసింది లక్నో. వారిద్దరూ అవుట్ అయినప్పటికీ.. నికొలస్ పూరన్, మార్కస్ స్టొయినిస్ జట్టును విజయ తీరాలకు చేర్చారు.

ఈ మ్యాచ్- ధోనీపై ఉన్న అభిమానానికి అద్దం పట్టింది. ధోనీ భాయ్ గ్రౌండ్‌లోకి అడుగుపెట్టినప్పుడు స్టేడియం మొత్తం దద్దరిల్లింది. స్టేడియం మొత్తం రీసౌండ్ వచ్చింది. 10 నిమిషాల పాటు కంటిన్యూ అయింది. ఫ్యాన్స్ అరుపులు కేకలు తప్ప ఇంకేమీ వినిపించలేదు.
స్టేడియంలోనే ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ క్వింటన్ డికాక్ భార్య సాషా.. తన స్మార్ట్ వాచ్ ద్వారా ఈ సౌండ్ లెవెల్స్‌ను రికార్డు చేశారు. ధోని గ్రౌండ్‌లోకి అడుగుపెట్టినప్పుడు వచ్చిన సౌండ్ తీవ్రత 92 డెసిబల్స్‌గా నమోదయింది. ఇది టెంపరరీ హియరింగ్ లాస్‌కు కారణమౌతుంది. దీన్ని ఆమె తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.