Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LSGకి షాక్: రూ.కోట్లు కుమ్మరించిన ప్లేయర్ ఐపీఎల్‌కు దూరం

లక్నో సూపర్ జెయింట్స్‌కు ఊహించని షాక్ ఎదురైంది. తమ ఫ్రాంచైజీ మరో ఆటగాడు ఈ ఐపీఎల్ సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. గాయం కారణంగా లీగ్ నుంచి తప్పుకుంటున్నట్లు యువ పేసర్ శివమ్ మావీ ప్రకటించాడు. ఇటీవల జరిగిన వేలంలో శివమ్ మావీ కోసం లక్నో యాజమాన్యం రూ.కోట్లు కుమ్మరించిన విషయం తెలిసిందే.

ఈ యువ పేసర్ కోసం లక్నో ఏకంగా రూ.6.40 కోట్లు వెచ్చింది. ఈ మినీ వేలంలో అతడి కోసమే లక్నో భారీ మొత్తం ఖర్చుపెట్టింది. రెండో స్థానంలో సిద్ధార్థ్ ఉన్నాడు. సిద్ధార్థ్ కోసం రూ.2.40 కోట్లు ఖర్చు చేసింది. అయితే ఈ సీజన్‌కు ఇప్పటికే ఇద్దరు లక్నో ప్లేయర్లు దూరమయ్యారు. పనిభారం కారణంగా మార్క్‌వుడ్ తప్పుకున్నాడు. అలాగే డేవిడ్ విల్లీ కూడా అందుబాటులో ఉండట్లేదని తెలిపాడు. డేవిడ్ విల్లీని వేలంలో లక్నో రూ.2 కోట్లకు సొంతం చేసుకోవడం గమనార్హం.

IPL 2024- LSG Shocked High-Priced Player Ruled Out for IPL with Rs 6 40 Crore Bid

అయితే మార్క్ వుడ్ స్థానంలో వెస్టిండీస్ నయా సంచలనం షామర్ జోసెఫ్‌ను తీసుకుంది. విల్లీ ప్లేస్‌ను న్యూజిలాండ్ పేస్ మ్యాట్ హెన్రీతో భర్తీ చేసింది. కాగా, శివమ్ మావీ రిప్లేస్‌మెంట్ గురించి లక్నో ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం లక్నో పేస్ బాధ్యతలను నవీనుల్ హక్, మయాంక్ యాదవ్, మోహ్సిన్ ఖాన్, యశ్ ఠాకూర్ మోస్తున్నారు. వీరికి బ్యాకప్ ప్లేయర్లుగా అర్షద్ ఖాన్, యుధ్వీర్ సింగ్, మ్యాట్ హెన్రీ, షామర్ జోసెఫ్ ఉన్నారు.

''ఐపీఎల్‌ను చాలా మిస్ అవుతాను. గాయం నుంచి కోలుకుని వచ్చాను. జట్టు కోసం గొప్పగా ఆడాలని, విజయంలో భాగమవ్వాలనుకున్నాను. కానీ దురదృష్టవశాత్తు లీగ్‌కు దూరమవ్వాల్సి వస్తుంది. గాయం తిరగబెట్టింది. అయితే మాకు మంచి టీమ్ ఉంది. మా జట్టును నేను ఉత్సాహపరుస్తూనే ఉంటాను. మేం విజేతగా నిలుస్తామని ఆశిస్తున్నాను'' అని శివమ్ మావీ పేర్కొన్నాడు.

లక్నో సూపర్ జెయింట్స్:
కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కైల్ మేయర్స్, మార్కస్ స్టొయినిస్, దీపక్ హుడా, దేవదత్ పడిక్కల్, రవి బిష్ణోయ్, నవీనుల్ హక్, కృనాల్ పాండ్య, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కడ్, యశ్ ఠాకూర్, అమిత్ ఠాకూర్, మిశ్రా, షామర్ జోసెఫ్, మయాంక్ యాదవ్, మోహ్సిన్ ఖాన్, కే.గౌతమ్, అర్షిన్ కులకర్ణి, సిద్ధార్థ్, అస్టన్ టర్నర్, అర్షద్ ఖాన్, మ్యాట్ హెన్రీ.

Story first published: Wednesday, April 3, 2024, 14:50 [IST]
Other articles published on Apr 3, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+