Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Delhi Capitals: హ్యారీ బ్రూక్ స్థానంలో కొత్త ప్లేయర్

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి కొత్త ఆటగాడు వచ్చాడు. సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్‌ లిజాద్ విలియమ్స్‌ను ఢిల్లీ ఫ్రాంచైజీ తీసుకుంది. కనీస ధర రూ.50 లక్షలతో సొంతం చేసుకుంది. వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్‌కు దూరమైన హ్యారీ బ్రూక్ స్థానంలో విలియమ్స్‌ను తీసుకున్నట్లు ప్రకటించింది. దక్షిణాఫ్రికా తరఫున విలియమ్స్ రెండు టెస్టులు, నాలుగు వన్డేలు, 11 టీ20లు ఆడాడు. 24 వికెట్లు పడగొట్టాడు.

కాగా, ఇటీవల జరిగిన వేలంలో హ్యారీ బ్రూక్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.4 కోట్లుకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. భారీ హిట్టర్ అయిన బ్రూక్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తాడని భారీ మొత్తాన్ని వెచ్చించింది. కానీ తన నాన్నమ్మ మరణించడంతో బ్రూక్ ఐపీఎల్‌కు దూరమయ్యాడు. కుటుంబంతో సమయాన్ని గడపాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నాడు.

IPL 2024 Lizaad Williams Joins Delhi Capitals as Harry Brook s Replacement

అంతకుముందు హ్యారీ బ్రూక్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించాడు. కానీ ఆశించిన రీతిలో సత్తాచాటలేకపోవడంతో ఎస్‌ఆర్‌హెచ్ అతన్ని వదిలిపెట్టింది. కాగా, ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పేలవప్రదర్శన చేస్తోంది. ఇప్పటివరకు ఆడిన అయిదు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించింది. నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. గత సీజన్‌ను ఢిల్లీ తొమ్మిదో స్థానంతో ముగించింది. అయితే రిషభ్ పంత్ పునరాగమంతో ఈ సీజన్‌లో సత్తాచాటాలని భావించిన ఢిల్లీ జట్టుకు వరుస ఓటములు ఎదురవుతున్నాయి.

ఢిల్లీ క్యాపిటల్స్: రిషభ్ పంత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, జే రిచర్డ్సన్, అన్రిచ్ నోకియా, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్, కుమార్ కుషాగ్రా, యశ్ ధుల్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, సుమిత్ కుమార్, ప్రవీణ్ దూబే, ముకేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, రికీ భుయ్, షై హోప్, విక్కీ, రసిక్ దార్ సలామ్, స్వస్తిక్, మిచెల్ మార్ష్.

Story first published: Monday, April 8, 2024, 11:33 [IST]
Other articles published on Apr 8, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+