Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: కష్టపడి తెచ్చుకున్న స్టార్.. అర్ధంతరంగా వదిలేసిన కేకేఆర్..!

KKR: తొలిసారి విదేశాల్లో జరగనున్న ఐపీఎల్ మినీ వేలానికి ముందు బృందంలో ఏయే ప్లేయర్లను ఉంచుకోవాలి? ఎవరిని రిలీజ్ చేసేయాలి? అనే విషయంపై ఫ్రాంచైజీలకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ క్రమంలోనే షారుఖ్ ఖాన్ టీం కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా కీలకమైన ఆటగాళ్లను ఉంచుకొని, మరికొందరిని వదిలేసింది.

ఇటీవల వన్డే వరల్డ్ కప్‌లో ఫెయిలైన శార్దూల్ ఠాగూర్‌ను కేకేఆర్ వదిలేయడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. గతేడాది ఎంతో కష్టపడి జట్టులోకి తీసుకున్న శార్దూల్‌ను కేకేఆర్ ఇలా వదిలేయడాన్ని ఫ్యాన్స్ కూడా అర్థం చేసుకున్నారు. శార్దూల్‌తోపాటు బంగ్లా స్టార్ షకీబ్ అల్ హసన్, ఉమేష్ యాదవ్ వంటి బడా ప్లేయర్లను కేకేఆర్ రిలీజ్ చేసేసింది.

IPL 2024 Kolkata Knight Riders retained and released players

ఈ టీం వద్ద గతేడాది కూడా భారీ స్క్వాడ్ ఉంది. దీన్ని చాలా వరకు ప్లేయర్లను పక్కన పెట్టేయాలని డిసైడ్ అయింది. అలాగే కెప్టెన్ శ్రేేయాస్ అయ్యర్‌ తిరిగి రావడంతో.. జట్టును అతని చుట్టూ నిర్మించాలని కేకేఆర్ అనుకుంటున్నట్లు కనిపిస్తోంది. అందుకే కీలకమైన ఆటగాళ్లను మాత్రం ఉంచుకొని, మిగతా వాళ్లను రిలీజ్ చేసేసింది.

అయ్యర్‌తోపాటు మిడిలార్డర్ స్టార్ నితీష్ రాణా, ఫినిషర్ రింకూ సింగ్, వెంకటేశ్ అయ్యర్, వరుణ్ చక్రవర్తి వంటి ప్లేయర్లను మాత్రం రిటైన్ చేసుకుంది. వీళ్లే కేకేఆర్‌లో భారతీయ బృందంలో కీలక ప్లేయర్లు కావడం గమనార్హం.

కేకేఆర్ రిలీజ్ చేసిన ప్లేయ్లు: షకీబ్ అల్ హసన్, టిమ్ సౌథీ, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, లోకీ ఫెర్గూసన్, కుల్వాంత్ ఖెజ్రోలియా, జాన్సన్ చార్లెస్, డేవిడ్ వీస్, లిటాన్ దాస్, మన్‌దీప్ సింగ్, ఆర్య దేశాయి, నారాయణ్ జగదీశన్

రిటైన్ చేసుకున్న ప్లేయర్లు: నితీష్ రాణా, రింకూ సింగ్, రహ్మనుల్లా గుర్బాజ్, శ్రేయాస్ అయ్యర్, జేసన్ రాయ్, సూయాష్ శర్మ, అనుకూల్ రాయ్, ఆండ్రీ రస్సెల్, వెంకటేశ్ అయ్యర్, హర్షిత్, సునీల్ నరైన్, రాణా, వైభవ్ అరోరా

Story first published: Sunday, November 26, 2023, 19:14 [IST]
Other articles published on Nov 26, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+