Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరుస పరాజయాల వేళ.. ముంబై ఇండియన్స్‌కు ఊరట

MI vs KKR: ఐపీఎల్ 2024లో భాగంగా నేడు మరో ఆసక్తికరమైన మ్యాచ్ జరుగనుంది. వరుస పరాజయాలను ఎదుర్కొంటోన్న ముంబై ఇండియన్స్‌తో నంబర్ 2 కోల్‌కత నైట్ రైడర్స్ తలపడబోతోంది. ఈ సాయంత్రం 7:30 గంటలకు ముంబైలోని వాంఖెడే స్టేడియంలో ఈ గేమ్ జరుగనుంది.

ముంబై ఇండియన్స్‌కు ఇది 11వ మ్యాచ్. ఇప్పటివరకు జరిగిన పదింట్లో ఆ జట్టు గెలిచింది ముచ్చటగా మూడు మాత్రమే. ఏడింట్లో ఓడింది. ఆరు పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. తన చివరి మూడు మ్యాచ్‌లల్లోనూ దారుణంగా ఓడింది హార్దిక్ పాండ్యా సేన. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ కేపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ చేతుల్లో మట్టికరించింది. ఇక కోల్‌కత నైట్ రైడర్స్‌పై తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

IPL 2024 Kolkata Knight Riders never win a match against Mumbai Indians after 2012 at Wankhede

కోల్‌కత నైట్ రైడర్స్ పరిస్థితి దీనికి భిన్నం. తన పదో మ్యాచ్ ఆడబోతోందీ జట్టు. ఇప్పటివరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌లల్లో ఆరింట్లో గెలిచింది. మూడింట్లో మాత్రమే ఓడిపోయింది. ప్రస్తుతం 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.

నిజానికి- వరుస పరాజయాలను ఎదుర్కొంటోన్న ముంబై ఇండియన్స్‌కు ఊరట కలగించడానికి అవకాశాలు ఉన్న గేమ్ ఇది. ఎందుకంటే- చివరి ఏడు సీజన్లల్లో వాంఖెడే స్టేడియంలో కోల్‌కత నైట్ రైడర్స్‌పై ఎప్పుడూ ఓడిపోలేదు ముంబై ఇండియన్స్. చివరిసారిగా 2012లో ఈ స్టేడియంలో కోల్‌కత నైట్‌రైడర్స్‌పై ఓటమి చవి చూసింది.

ఆ తరువాత ఇక్కడ ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ గెలుపు లోకల్ టీమ్‌నే వరిస్తూ వచ్చింది. అదే ట్రెడీషన్‌ను ఇప్పుడు కూడా కొనసాగించగలిగితే మరో రెండు పాయింట్లు ముంబై ఇండియన్స్ ఖాతాలో వచ్చి చేరుతాయి.

ఐపీఎల్ సీజన్ మొత్తం మీద ఈ రెండు జట్లు 32 సార్లు తలపడగా.. 23 సార్లు ముంబై ఇండియన్స్ విజయం సాధించడం కూడా ఓ కారణంగా చెప్పుకోవచ్చు. 10 సార్లు మాత్రమే కేకేఆర్ నెగ్గింది. ఈ పదింట్లో కూడా వాంఖెడేలో గెలిచింది ఒక్కటంటే ఒక్కటే. ఈ రెండింట్లో ఏ జట్టు గెలిచినా వాటి రికార్డుల మెరుగుపడినట్టే అవుతుంది.

Story first published: Friday, May 3, 2024, 12:40 [IST]
Other articles published on May 3, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+