For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్లాసెన్.. ఊర మాస్

Klaasen: ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పోరాడి ఓడింది. ఈడెన్ గార్డెన్స్‌లో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత నైట్ రైడర్స్ చేతిలో నాలుగు పరుగుల తేడాతో పరాజయాన్ని చవి చూసింది. ఈ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఓడినప్పటికీ- గెలుపు కోసం అద్భుతంగా పోరాడింది. మ్యాచ్‌ను చిట్టచివరి బంతి వరకూ తీసుకెళ్లింది. ఒకదశలో ప్రత్యర్థులకు చెమటలు పట్టించింది. భయాన్ని పరిచయం చేసింది.

తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో 200 మార్కులను దాటిన తొలి జట్టు ఇదే. దీన్ని ఛేదించడానికి క్రీజ్‌లోకి దిగిన ఆరెంజ్ ఆర్మీ.. చివరి వరకూ పోరాడింది గానీ విజయాన్ని అందుకోలేకపోయింది. 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేయగలిగింది.

IPL 2024 KKR vs SRH Twitterati in praises Heinrich Klaasen for his batting display

సన్‌రైజర్స్ హైదరాబాద్ తన స్కోరును 200లను దాటించగలుగుతుందని ఎవరూ ఊహించివుండరు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్- 32, అభిషేక్ శర్మ- 32, రాహుల్ త్రిపాఠి- 20, ఎయిడెన్ మార్క్‌రమ్-18 పరుగులకు టాప్ ఆర్డర్ బ్యాటర్లు అవుట్ అయినప్పుడు సన్‌రైజర్స్ ఖేల్ ఖతం అనే అనుకున్నారంతా.

150 పరుగులు చేయడం కూడా కష్టమేనని భావించిన ఫ్యాన్స్‌కు ఐఫీస్ట్ ఇచ్చాడు క్లాసెన్. మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన క్లాసెన్.. పరుగుల వరద పారించాడు. 29 బంతుల్లో ఎనిమిది సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే అర్ధసెంచరీని అందుకున్నాడు.

వరుణ్ చక్రవర్తి వేసిన ఇన్నింగ 18వ ఓవర్ తొలి, మూడో బంతిని సిక్సర్లుగా మలచి గేర్ మార్చాడు క్లాసెన్. అదే ఓవర్ అయిదో బంతిని షాబాజ్ అహ్మద్ కూడా ఫెన్సింగ్ దాటించడంతో మొత్తం 21 పరుగులొచ్చాయి. మిఛెల్ స్టార్క్ సంధించిన 19వ ఓవర్‌లో విశ్వరూపం చూపాడు క్లాసెన్. మూడు సిక్సర్లు కొట్టాడు. ఆ ఓవర్ చివరి బంతికి షాబాజ్ అహ్మద్ సిక్స్ బాదడంతో 26 పరుగులొచ్చాయి.

IPL 2024 KKR vs SRH Twitterati in praises Heinrich Klaasen for his batting display

అదే ఊపుతో చివరి ఓవర్ తొలి బంతిని కూడా క్లాసెన్ సిక్స్‌గా మలిచాడు. దీనితో 202 పరుగులకు చేరింది సన్‌రైజర్స్ స్కోర్ బోర్డ్. చివరి అయిదు బంతుల్లో ఆరు పరుగులు చేయాల్సిన దశలో హర్షిత్ రాణా మేజిక్ చేశాడు. మూడో బంతికి షాబాజ్ అహ్మద్‌ను పెవిలియన్ దారి పట్టించాడు.

అదే ఓవర్ అయిదో బంతికి క్లాసెన్ కూడా అవుట్ అయ్యాడు. హర్షిత్ రాణా వేసిన స్లోయర్ బంతిని లెగ్ సైడ్ ఆడబోయాడు. టైమింగ్ మిస్ అయ్యాడు. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి షార్ట్ థర్డ్ మ్యాన్ వైపు గాల్లోకి లేచింది. దీన్ని అద్భుతంగా అందుకోగలిగాడు సుయాష్ శర్మ. దీనితో క్లాసెన్ సునామీ ఇన్నింగ్‌కు తెరపడింది. క్లాసెన్ పోరాటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

Story first published: Sunday, March 24, 2024, 7:48 [IST]
Other articles published on Mar 24, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+