Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్టేడియంలో షారుక్ ఖాన్ పాడుపని.. అడ్డంగా దొరికేశాడు (Video)

బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ వివాదంలో చిక్కుకున్నాడు. ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో అతడు చేసిన నిర్వాకానికి విమర్శలు వెల్లువెత్తున్నాయి. అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన హీరోనే ఇలా చేయడమేంటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అసలేం జరిగిందంటే..

శనివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించిన వియం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. రసెల్ (64; 25 బంతుల్లో) మూడు ఫోర్లు, ఏడు సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. సాల్ట్ (54; 40 బంతుల్లో) అర్ధశతకం సాధించాడు. రింకూ సింగ్ (23; 15 బంతుల్లో) ఫర్వాలేదనిపించాడు.

IPL 2024 KKR vs SRH Shah Rukh Khan Caught on Camera Smoking in Stadium

అయితే కోల్‌కతా ఇన్నింగ్స్ పదో ఓవర్‌లో కేకేఆర్ సహయజమాని షారుక్ ఖాన్ స్మోకింగ్ చేస్తూ కెమెరా కంటికి చిక్కాడు. అయితే అది సిగిరేట్‌యేనా? లేదా వేరేదా? అనేది వీడియోలో స్పష్టంగా కనపడలేదు. మరోవైపు స్టేడియంలో స్మోకింగ్ చేయడమేంటని షారు‌క్ ఖాన్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

కాగా, షారుక్ ఖాన్ వివాదాల్లో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు. 2012లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో సిబ్బందితో గొడవపడిన షారు‌క్‌కు చుక్కెదురైంది. బాలీవుడ్ బాద్‌షాను స్టేడియంలో అనుమతించకుండా ముంబై క్రికెట్ అసోషియేషన్ అయిదేళ్లపాటు నిషేధం విధించింది. తాజా ఘటనపై బెంగాల్ క్రికెట్ అసోషియేషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (63; 29 బంతుల్లో) గొప్ప పోరాటం వృథాగా మారింది. జోరు మీదున్న క్లాసెన్‌ను ఆఖరి ఓవర్‌లో హర్షిత్ రాణా ఔట్ చేసి హైదరాబాద్‌ను దెబ్బకొట్టాడు. చివరి ఓవర్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌కు 13 పరుగులు అవసరమవ్వగా తొలి బంతిని క్లాసెన్ సిక్సర్ బాదాడు. కానీ ఆ తర్వాతి అయిదు బంతుల్లో హర్షిత్ రెండు పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.

Story first published: Sunday, March 24, 2024, 12:53 [IST]
Other articles published on Mar 24, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+