Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సరికొత్త రికార్డు సృష్టించిన ఐపీఎల్ స్టార్: బుమ్రా కూడా దిగదుడుపే

Sunil Narine: ఐపీఎల్ 2024 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. కోల్‌కత నైట్‌రైడర్స్‌పై ఓడిపోయింది. ఆ జట్టుకు ఇది వరుసగా ఆరో ఓటమి. ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌లల్లో ఆర్సీబీ గెలిచింది ఒక్కటే. ఈ వరుస ఓటముల తరువాత ప్లేఆఫ్స్ చేరుకునే అవకాశాలను దాదాపుగా కోల్పోయినట్టయింది.

ఆదివారం మధ్యాహ్నం కోల్‌కత ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో ఒక పరుగు తేడాతో ఓడిపోయింది ఆర్సీబీ. తొలుత బ్యాటింగ్‌కు దిగిన నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. ఈ టార్గెట్‌ను ఛేదించడానికి చిట్టచివరి వరకూ పోరాడింది ఆర్సీబీ. 20 ఓవర్లల్లో 221 పరుగుల వద్ద ఆలౌట్ అయింది.

IPL 2024 KKR vs RCB Sunil Narine surpassed Lasith Malinga as most wicket taker for single franchise

222 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ప్రారంభ ఓవర్లల్లో ధాటిగా ఆడింది ఆర్సీబీ. ఓపెనర్లతో పాటు మిడిలార్డర్ బ్యాటర్లు విఫలం కావడం జట్టు పరాజయానికి దారి తీసింది. టాప్ ఆర్డర్‌లో విల్ జాక్స్- 55, రజత్ పటిదార్- 52 తరువాత ఈ స్థాయిలో ఎవరూ భారీ స్కోర్ గానీ, భాగస్వామ్యాన్ని గానీ నమోదు చేయలేకపోయారు.

ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో విఫలమైన కోల్‌కత నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్.. బంతితో రాణించాడు. కీలక వికెట్ల పడగొట్టాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 34 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. కామెరాన్ గ్రీన్, మహిపాల్ లోమ్రార్‌ను పెవిలియన్ దారి పట్టించాడు.

ఈ రెండు వికెట్లను తీసుకోవడంతో ఓ సరికొత్త చరిత్రను సునీల్ నరైన్ సృష్టించినట్టయింది. ఐపీఎల్‌లో ఒకే ఫ్రాంఛైజీ తరఫున ఆడుతూ అత్యధిక వికెట్లను పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు. 169 మ్యాచ్‌లల్లో 172 వికెట్లు పడగొట్టాడు సునీల్ నరైన్. అతని బెస్ట్ బౌలింగ్ ఫీగర్.. 5/19.

గతంలో ఈ రికార్డు లసిత్ మలింగ పేరు మీద ఉండేది. ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ మ్యాచ్‌లను ఆడిన శ్రీలంక లెజెండరీ ఫాస్ట్ బౌలర్ మలింగ.. 122 మ్యాచ్‌లల్లో 170 వికెట్లను తీసుకున్నాడు. దీన్ని బ్రేక్ చేశాడు సునీల్. తన వికెట్ల సంఖ్యను 172కు పెంచుకోగలిగాడు.

సింగిల్ ఫ్రాంఛైజీ తరఫున అత్యధిక వికెట్లను పడగొట్టిన బౌలర్ల జాబితాలో జస్‌ప్రీత్ బుమ్రా- 158 (ముంబై ఇండియన్స్), భువనేశ్వర్ కుమార్- 150 (సన్‌రైజర్స్ హైదరాబాద్), డ్వేన్ బ్రావో- 140 (చెన్నై సూపర్ కింగ్స్) ఉన్నారు. బుమ్రా, భువనేశ్వర్ కుమార్ ఇంకా మ్యాచ్‌లను ఆడుతున్న నేపథ్యంలో వీరిద్దరిలో ఎవరో ఒకరు ఈ రికార్డును చేరుకునే అవకాశం ఉంది.

Story first published: Monday, April 22, 2024, 12:06 [IST]
Other articles published on Apr 22, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+