Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సునీల్ నరైన్ అంతలా పడీ పడీ నవ్వుతున్నాడు- ఏం జోక్ చెప్పావ్ కోహ్లీ బ్రో

Sunil Narine Virat Kohli: ఐపీఎల్ 2024 సీజన్‌‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక మ్యాచ్ ఆడుతోంది. కోల్‌కత నైట్‌రైడర్స్‌తో తలపడుతోంది. ఈడెన్ గార్డెన్స్ దీనికి వేదిక. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది.

ప్రారంభంలో దూకుడుగా ఆడినా ఆ తరువాత వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది కేకేఆర్. మిడిలో ఓవర్లల్లో తడబడింది గానీ.. ఆ తరువాత కుదురుకుంది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ సునామీ ఇన్నింగ్, కేప్టెన్ శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీ, చివర్లో రమణ్‌దీప్ సింగ్ ఉప్పెనలా విరుచుకుపడటంతో 200లను దాటింది కేకేఆర్ ఇన్నింగ్ స్కోర్.

IPL 2024 KKR vs RCB Sunil Narine is laughing as Virat Kohli s prank during the match

ఇదంతా ఒక ఎత్తయితే.. సునీల్ నరైన్ నవ్వుతూ కనిపించడం మరో ఎత్తు. ఎప్పుడూ స్తబ్దుగా, ముభావంగా కనిపించే సునీల్ నరైన్.. మ్యాచ్ సమయంలో పడీ పడీ నవ్వాడు. విరాట్ కోహ్లీ చేసిన ప్రాంక్‌కు అతను గట్టిగా నవ్వడం కనిపించింది. సాధారణంగా సునీల్ నరైన్ పెద్దగా నవ్వడు. కామ్ గోయింగ్ పర్సనాలిటీ అతనిది.

హాఫ్ సెంచరీ చేసినా.. సెంచరీ బాదినా ఒకే రకమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో దర్శనం ఇస్తుంటాడు. వికెట్లు పడగొట్టినా మిగిలిన బౌలర్లలాగా పెద్దగా సెలబ్రేట్ చేసుకోడు. రాముడు మంచి బాలుడిలా ఉంటాడు. అసలతను నవ్వుతాడా? లేదా? అనేది హాట్ టాపిక్‌గా మారిన సందర్భాలు లేకపోలు. హాస్యగ్రంధులు ఉన్నాయా? లేవా? అనిపించేలా ఉంటుంది సునీల్ నరైన్ ప్రవర్తన.

అలాంటి సునీల్ నరైన్‌ను పడీ పడీ నవ్వుకునేలా చేశాడు విరాట్ కోహ్లీ. ఈ మ్యాచ్ ఆరంభంలో విరాట్ కోహ్లీ చేసిన ప్రాంక్, ఆ తరువాత తన వద్దకు వచ్చి చెప్పిన జోక్‌కు నవ్వకుండా ఉండలేకపోయాడు సునీల్. నవ్వాపుకోలేకపోయాడు. గట్టిగా పగలబడి నవ్వాడు. నవ్వుకుంటూనే క్రీజ్‌లోకి చేరుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో సునీల్ నరైన్‌ విఫలం అయ్యాడు. భారీ స్కోర్ చేయలేకపోయాడు. అతన్ని త్వరగా అవుట్ చేయడంలో సక్సెస్ కాగలిగింది ఆర్సీబీ. అతన్ని సకాలంలో కట్టడి చేయగలిగారు బౌలర్లు. ఆరో ఓవర్ రెండో బంతికి సునీల్ నరైన్ పెవిలియన్ దారి పట్టాడు. యష్ దయాళ్ వేసిన ఓవర్ అది.

ఆఫ్ స్టంప్స్‌కు కాస్త దూరంగా పడిన స్లోయర్ డెలివరీని లాంగ్ ఆన్ దిశగా భారీ షాట్ ఆడాడు నరైన్. తన తల మీదుగా దూసుకెళ్తోన్న బంతిని గాల్లోకి ఎగిరి అద్భుతంగా అందుకున్నాడు విరాట్ కోహ్లీ. 15 బంతుల్లో రెండు ఫోర్లతో 10 పరుగులే చేశాడు సునీల్ నరైన్.

Story first published: Sunday, April 21, 2024, 17:43 [IST]
Other articles published on Apr 21, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+