For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గ్రేట్ గేమ్ ప్లాన్- సగం మ్యాచ్ ఆర్సీబీ చేతికొచ్చినట్టే

KKR vs RCB: ఐపీఎల్ 2024 సీజన్‌‌లో మరో ఆసక్తికర మ్యాచ్. బలమైన కోల్‌కత నైట్ రైడర్స్‌తో తలపడుతోంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. కోల్‌కతలోని ఈడెన్ గార్డెన్స్ దీనికి వేదిక. తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఆర్సీబీ. ఈ మ్యాచ్ కోసం ఆర్సీబీ తుది జట్టులో చోటు చేసుకున్న మార్పులు ఫలితాన్ని ఇచ్చాయి.

ప్రారంభంలో దూకుడుగా ఆడినా ఆ తరువాత వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది కేకేఆర్. తొలి ఓవర్ నుంచే బాదుడు కార్యక్రమాన్ని పెట్టుకున్నారు కోల్‌కత నైట్‌రైడర్స్ ఓపెనర్లు ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్. మహ్మద్ సిరాజ్ వేసిన తొలి ఓవర్‌లోనే 12 పరుగులను పిండుకున్నారు. యష్ దయాళ్ వేసిన రెండో ఓవర్‌లోనూ 11 పరుగులొచ్చాయి.

IPL 2024 KKR vs RCB Royal Challengers success to get Sunil Narine wicket an early

ఇక ఇన్నింగ్ నాలుగో ఓవర్‌లో విశ్వరూపాన్ని చూపాడు ఫిల్ సాల్ట్. లోకీ ఫెర్గూసన్ వేసిన ఓవర్ అది. ఆ ఓవర్‌లో ఏకంగా 28 పరుగులను రాబట్టుకున్నాడు. 6,4,4,6,4,4.. ఈ డిజిట్స్.. అతని బ్యాటింగ్ ప్రతాపానికి అద్దం పట్టాయి. 13 బంతుల్లోనే 48 పరుగులను చేశాడు ఫిల్ సాల్ట్. ఐపీఎల్‌లో మరో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదవుతుందనుకున్నారు గానీ అది సాధ్యపడలేదు.

అయిదో ఓవర్ రెండో బంతికి అవుట్ అయ్యాడు. మహ్మద్ సిరాజ్ వేసిన ఓవర్ అది. లెగ్ స్టంప్ మీదుగా దూసుకొచ్చిన ఫుల్లర్ డెలివరీని ఫ్లిక్ చేశాడు సాల్ట్. టైమింగ్ మిస్ అయ్యాడు. డీప్ మీడ్ వికెట్ మీదుగా గాల్లోకి లేచిన బంతిని అక్కడే పొంచివున్న రజత్ పటిదార్ అద్భుతంగా అందుకున్నాడు. 14 బంతుల్లో ఏడు మెరుపుల్లాంటి ఫోర్లు, మూడు భారీ సిక్సర్లతో 48 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

ఫిల్ సాల్ట్ తరువాత వెంటవెంటనే రెండు వికెట్లను కోల్పోయింది కోల్‌కత నైట్ రైడర్స్. ప్రత్యేకించి సునీల్ నరైన్‌ను త్వరగా అవుట్ చేయడంలో సక్సెస్ కాగలిగింది. రాజస్థాన్ రాయల్స్‌పై జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో కదం తొక్కాడు సునీల్. 56 బంతుల్లో ఆరు సిక్సర్లు, 13 ఫోర్లతో 109 పరుగులు చేశాడు.

అంతకుముందు ఆర్సీబీపైనే జరిగిన మ్యాచ్‌లోనూ మెరుపు ఇన్నింగ్ ఆడాడు. 22 బంతుల్లో అయిదు సిక్సర్లు, రెండు ఫోర్లతో 47 పరుగులు బాదాడీ లెఫ్ట్ హ్యాండర్. ఢిల్లీ కేపిటల్స్‌పైనా విరుచుకుపడ్డాడు. 39 బంతుల్లో ఏడు చొప్పున ఫోర్లు, సిక్సర్లు బాదాడు. 85 పరుగులు చేశాడా మ్యాచ్‌లో.

అలాంటి బ్యాటర్‌ను కట్టడి చేయగలిగారు ఆర్సీబీ బౌలర్లు. ఆరో ఓవర్ రెండో బంతికి సునీల్ నరైన్ పెవిలియన్ దారి పట్టాడు. యష్ దయాళ్ వేసిన ఓవర్ అది. ఆఫ్ స్టంప్స్‌కు కాస్త దూరంగా పడిన స్లోయర్ డెలివరీని లాంగ్ ఆన్ దిశగా భారీ షాట్ ఆడాడు నరైన్. తన తల మీదుగా దూసుకెళ్తోన్న బంతిని గాల్లోకి ఎగిరి అద్భుతంగా అందుకున్నాడు విరాట్ కోహ్లీ. 15 బంతుల్లో రెండు ఫోర్లతో 10 పరుగులే చేశాడు సునీల్.

Story first published: Sunday, April 21, 2024, 16:50 [IST]
Other articles published on Apr 21, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+