KKR vs RCB: ఐపీఎల్ 2024 సీజన్‌లో మరో ఆసక్తికర మ్యాచ్. బలమైన కోల్‌కత నైట్ రైడర్స్‌తో తలపడబోతోంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. కోల్‌కతలోని ఈడెన్ గార్డెన్స్ దీనికి వేదిక. కొద్దిసేపటి కిందటే టాస్ పడింది. ఆర్సీబీ టాస్ గెలిచింది. తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు ఆ జట్టు కేప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్.
ఈడెన్ గార్డెన్స్ ఎప్పుడూ ఛేజింగ్ గ్రౌండేనని, టాస్ గెలిస్తే మరో మాట లేకుండా తొలుత బౌలింగ్ ఎంచుకోవాలని ముందే డిసైడ్ అయ్యామని చెప్పాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో అన్ని జట్లు చాలా దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాయని, పవర్ ప్లేలో 60 నుంచి 70 పరుగులు రాబట్టుకోవడం కొత్త ఆనవాయితీగా మారిందని వ్యాఖ్యానించాడు.

తమ జట్టులో మూడు మార్పులు చేసినట్లు ఫాఫ్ డుప్లెసిస్ వివరించాడు. మహ్మద్ సిరాజ్, కామెరాన్ గ్రీన్, కర్ణ్ శర్మలను ప్లేయింగ్ 11లోకి తీసుకున్నట్లు చెప్పాడు. ఫామ్‌ను అందిపుచ్చుకోవడానికి తంటాలు పడుతున్న ఓ బ్యాటర్ లాగా తన జట్టు పరిస్థితి తయారైందని వ్యాఖ్యానించాడు. ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు- జట్టు మొత్తం మళ్లీ గాడినపడుతుందని డుప్లెసిస్ ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.
ఆర్సీబీ తుది జట్టులో- విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కేప్టెన్), విల్ జాక్స్, రజత్ పటిదార్, కెమెరూన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్) మహిపాల్ లోమ్రార్, కర్ణ్ శర్మ, లోకీ ఫెర్గూసన్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాళ్‌కు చోటు దక్కింది. సుయాష్ ప్రభుదేశాయ్, అనూజ్ రావత్, హిమాన్షు శర్మ, వైశాఖ్ విజయ్‌కుమార్, స్వప్నిల్ సింగ్ సబ్‌స్టిట్యూట్‌గా ఎంపికయ్యారు.
కోల్‌కోత నైట్ రైడర్స్ తుదిజట్టులో- ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అంగ్‌రిష్ రఘువంశీ, శ్రేయాస్ అయ్యర్ (కేప్టెన్), వెంకటేష్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, రమణ్‌దీప్ సింగ్, మిఛెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణాలు ఆడుతున్నారు. సుయాష్ శర్మ, అనుకుల్ రాయ్, మనీష్ పాండే, వైభవ్ అరోరా, రహ్మనుల్లా గుర్బాజ్ సబ్‌స్టిట్యూట్‌గా సెలెక్ట్ అయ్యారు.