Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆర్సీబీకి పెద్ద చిక్కే వచ్చి పడిందే..!!

KKR vs RCB: ఐపీఎల్ 2024 సీజన్‌ అంచనాలకు అందట్లేదు. అనూహ్యంగా భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. 50- ఓవర్ల ఫార్మట్ తరహాలో మ్యాచ్‌లు సాగుతున్నాయి. ప్రత్యేకించి.. సన్‌రైజర్స్ హైదరాబాద్. ఈ జట్టు ఆటతీరుకు హద్దులు ఉండట్లేదు. టీ20 గేమ్‌లో ఉండే హద్దులన్నింటినీ చెరిపేసింది. ఈ జట్టు 250కి పైగా స్కోర్‌ను నమోదు చేస్తోందంటే నమ్మశక్యం కావట్లేదు క్రికెట్ పండితులకు.

అదే తరహాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పెర్ఫార్మెన్స్ కూడా అంతు చిక్కట్లేదు. వరుస పరాజయాలను చవి చూస్తోంది ఈ మెగా టీమ్. ప్లేఆఫ్స్ ఆశలను దాదాపుగా వదిలేసుకున్నట్టే కనిపిస్తోంది. వరుసగా అయిదు మ్యాచ్‌లల్లో దారుణంగా ఓడిపోయింది. దాని నెట్ రన్‌రేట్ మైనస్‌లల్లో ఉంటోంది.

IPL 2024 KKR vs RCB Royal Challengers Bengaluru will play in Green Jersey today

ఇప్పటివరకు జరిగిన ఆరు మ్యాచ్‌లల్లో ఒక్కటంటే ఒక్కదాంట్లోనే గెలిచింది. రెండు పాయింట్లతోనే సరిపెట్టుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో దాని స్థానం.. 10. నేడు తన తదుపరి మ్యాచ్‌ను ఆడబోతోంది. కోల్‌కత నైట్‌రైడర్స్‌ను ఢీ కొట్టబోతోంది. కోల్‌కత ఈడెన్ గార్డెన్స్ దీనికి వేదిక.

ఈ వరుస ఓటముల తరువాత రాయల్ ఛాలెంజర్స్ ప్లేఆఫ్ అవకాశాలు సంక్లిష్టం అయినట్టే. ఇంకా ఏడు మ్యాచ్‌లు ఆర్సీబీ చేతిలో ఉన్నప్పటికీ గెలుస్తుందనే ఆశలు అడుగంటాయి. నేటి కోల్‌కత నైట్ రైడర్స్‌తో పాటు గుజరాత్ టైటాన్స్‌తో రెండేసి చొప్పున మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ను ఒక్కొక్క గేమ్‌‌లో ఎదుర్కొనాల్సి ఉంది. వీటిల్లో కనీసం అయిదు మ్యాచ్‌లను భారీ రన్‌రేట్‌తో గెలిస్తే గానీ ఆర్సీబీకి ప్లేఆఫ్ అవకాశాలు సజీవంగా ఉండవు. ఈ సారి కూడా ఆర్సీబీ ఫ్యాన్స్‌కు నిరాశ తప్పకపోవచ్చనే సంకేతాలు టోర్నమెంట్ ఆరంభం నుంచే అందుతున్నాయి.

ఈ పరిస్థితుల్లో నేడు కోల్‌కత నైట్‌రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌లో గ్రీన్ జెర్సీను ధరించబోతోంది ఆర్సీబీ. లేత ఆకుపచ్చ రంగుతో కూడిన జెర్సీ ఇది. గో గ్రీన్ జెర్సీగా దీన్ని ప్రకటించింది రాయల్ ఛాలెంజర్స్ ఫ్రాంఛైజీ. పచ్చదనాన్ని పరిరక్షించాలనే సందేశాన్ని ఇవ్వడానికే తమ రెగ్యులర్ జెర్సీని లేత ఆకుపచ్చ రంగులోకి మార్చుకుంది.

ప్రతి సంవత్సరం కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు- ఒక మ్యాచ్‌ను ఇలా గ్రీన్ జెర్సీతో ఆడటం ఆనవాయితీగా వస్తోంది. 2011 నుంచి గ్రీన్ జెర్సీని ధరించడాన్ని ఆనవాయితీగా మార్చుకుంది రాయల్ ఛాలెంజర్స్. పెద్దగా అదృష్టం కలిసిరాలేదు. ఇప్పటివరకు డజను మ్యాచ్‌లల్లో ఆర్సీబీ ప్లేయర్లు గ్రీన్ జెర్సీతో గ్రౌండ్‌లోకి దిగారు.

నాలుగు మ్యాచ్‌లల్లో గెలిచారు. ఏడింట్లో ఓడారు. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్, 2023లో రాజస్థాన్ రాయల్స్‌ను గ్రీన్ జెర్సీ మ్యాచ్‌లల్లో ఓడించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్. అదే సంప్రదాయాన్ని కొనసాగించితే హ్యాట్రిక్ కొట్టినట్టే అవుతుంది.

Story first published: Sunday, April 21, 2024, 9:45 [IST]
Other articles published on Apr 21, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+