Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ భాయ్.. నీ మీద ఒట్టు: ఇంకోసారి అలా ఆడను: రింకూ సింగ్

Travis Head: ఐపీఎల్ 2024 సీజన్‌‌లో మరో ఆసక్తికర మ్యాచ్. ఇంకాస్సేపట్లో మొదలు కాబోతోంది. బలమైన కోల్‌కత నైట్ రైడర్స్‌తో తలపడబోతోంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. కోల్‌కతలోని ఈడెన్ గార్డెన్స్ దీనికి వేదిక.

ఆర్సీబీకి ఇది లైఫ్ అండ్ డెత్ గేమ్. చావో రేవో తేలిపోతుందీ మ్యాచ్‌తో. గెలిస్తే ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోగలుగుతుంది. లేదంటే- ప్లేఆఫ్స్ చేరకుండానే ఈ టోర్నమెంట్‌ నుంచి వెనుదిరిగిన మొదటి జట్టు అవుతుంది. ఇప్పటివరకు జరిగిన ఆరు మ్యాచ్‌లల్లో ఒక్కటంటే ఒక్కదాంట్లోనే గెలిచింది. రెండు పాయింట్లతోనే సరిపెట్టుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో దాని స్థానం.. 10.

IPL 2024 KKR vs RCB Rinku Singh is seen pleading with Virat Kohli to give him a new bat

నైట్‌రైడర్స్‌తో మ్యాచ్ తరువాత ఆర్సీబీ చేతిలో ఇంకా ఆరు గేమ్‌లు ఉన్నప్పటికీ గెలుస్తుందనే ఆశలు అడుగంటినట్టవుతాయి. గుజరాత్ టైటాన్స్‌తో రెండేసి చొప్పున మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ను ఒక్కొక్క గేమ్‌‌లో ఎదుర్కొనాల్సి ఉంది. వీటిల్లో కనీసం అయిదు మ్యాచ్‌లను భారీ రన్‌రేట్‌తో గెలిస్తే గానీ ఆర్సీబీకి ప్లేఆఫ్ చేేరదు.

ఈ మ్యాచ్‌ గెలవడానికి ఆర్సీబీ గట్టిగానే కృషి చేస్తోంది. నెట్స్‌లో చెమటోడుస్తోంది. కేప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్, రజత్ పటిదార్, మహ్మద్ సిరాజ్.. ఇలా జట్టు మొత్తం కఠోరంగా శ్రమిస్తోంది. నెట్ ప్రాక్టీస్ కొనసాగుతున్న సమయంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.

కోల్‌కత నైట్ రైడర్స్ బ్యాటర్ రింకూ సింగ్.. విరాట్ కోహ్లీతో ముచ్చట్లు పెట్టుకున్నాడు. ఓ కొత్త బ్యాట్ తనకు ప్రసాదించాలంటూ అడగటం కనిపించింది. గతంలో విరాట్ కోహ్లీ ఇచ్చిన బ్యాట్‌తోనే మ్యాచ్‌లను ఆడాడు రింకూ సింగ్. ఇంతకుముందు మ్యాచ్‌లో అది కాస్త విరిగిపోయింది.

కోహ్లీ ఇఛ్చిన బాగా అచ్చొచ్చినట్టు కావడంతో కొత్త బ్యాట్ కోసం పట్టుబట్టాడు రింకూ సింగ్. గతంలో ఇచ్చిన బ్యాట్ ఏమైందంటూ కోహ్లీ ప్రశ్నించాడు. అది విరిగిపోయిందంటూ రిప్లై ఇచ్చాడు రింకూ. విరిగిందానికి తానేం చేయాలంటూ కౌంటర్ వేశాడు విరాట్ కోహ్లీ. ఇంకో కొత్త బ్యాట్ ఇవ్వాలని, అది విరిగిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటానని కోహ్లీ మీద ఒట్టు పెట్టి మరీ బతిమిలాడాడు.

Story first published: Sunday, April 21, 2024, 14:53 [IST]
Other articles published on Apr 21, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+