For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఊచకోత అనే పదం చిన్నదే: ఒక్క ఓవర్‌లో అన్నేసి పరుగులా?

KKR vs RCB: ఐపీఎల్ 2024 సీజన్‌‌లో మరో ఆసక్తికర మ్యాచ్. బలమైన కోల్‌కత నైట్ రైడర్స్‌తో తలపడుతోంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. కోల్‌కతలోని ఈడెన్ గార్డెన్స్ దీనికి వేదిక. తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఆర్సీబీ. ఈ మ్యాచ్ కోసం ఆర్సీబీ తుది జట్టులో చోటు చేసుకున్న మార్పులు ఫలితాన్ని ఇచ్చాయి.

ప్రారంభంలో దూకుడుగా ఆడినా ఆ తరువాత వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది కేకేఆర్. తొలి ఓవర్ నుంచే బాదుడు కార్యక్రమాన్ని పెట్టుకున్నారు కోల్‌కత నైట్‌రైడర్స్ ఓపెనర్లు ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్. మహ్మద్ సిరాజ్ వేసిన తొలి ఓవర్‌లోనే 12 పరుగులను పిండుకున్నారు.

IPL 2024 KKR vs RCB Phil Salt punished Lockie Fergusan and smashed 28 runs in 4th over

తొలి ఓవర్ రెండో బంతిని సిక్స్‌గా మలిచాడు ఫిల్ సాల్ట్. మూడో బంతినీ పనిష్ చేశాడు. ఆఫ్ స్టంప్ సమీపంలో పడ్డ లెంగ్త్ డెలివరీని మిడ్ వికెట్ మీదుగా లాఫ్టింగ్ షాట్ ఆడాడు. సింగిల్ బౌన్స్‌తో బౌండరీ లైన్ క్రాస్ చేసిందా బంతి. ఆ తరువాత కూడా ఓపెనర్ల దూకుడుకు బ్రేక్ పడలేదు. యష్ దయాళ్ వేసిన రెండో ఓవర్‌లోనూ 11 పరుగులొచ్చాయి.

ఇక ఇన్నింగ్ నాలుగో ఓవర్‌లో విశ్వరూపాన్ని చూపాడు ఫిల్ సాల్ట్. లోకీ ఫెర్గూసన్ వేసిన ఓవర్ అది. ఆ ఓవర్‌లో ఏకంగా 28 పరుగులను రాబట్టుకున్నాడు. 6,4,4,6,4,4.. ఈ డిజిట్స్.. అతని బ్యాటింగ్ ప్రతాపానికి అద్దం పట్టాయి. 13 బంతుల్లోనే 48 పరుగులను చేశాడు ఫిల్ సాల్ట్. ఐపీఎల్‌లో మరో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదవుతుందనుకున్నారు గానీ అది సాధ్యపడలేదు.

అయిదో ఓవర్ రెండో బంతికి అవుట్ అయ్యాడు. మహ్మద్ సిరాజ్ వేసిన ఓవర్ అది. లెగ్ స్టంప్ మీదుగా దూసుకొచ్చిన ఫుల్లర్ డెలివరీని ఫ్లిక్ చేశాడు సాల్ట్. టైమింగ్ మిస్ అయ్యాడు. డీప్ మీడ్ వికెట్ మీదుగా గాల్లోకి లేచిన బంతిని అక్కడే పొంచివున్న రజత్ పటిదార్ అద్భుతంగా అందుకున్నాడు. దీనితో అతని మెరుపు ఇన్నింగ్‌కు తెరపడింది. 14 బంతుల్లో ఏడు మెరుపుల్లాంటి ఫోర్లు, మూడు భారీ సిక్సర్లతో 48 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

ఫిల్ సాల్ట్ తరువాత వెంటవెంటనే రెండు వికెట్లను కోల్పోయింది కోల్‌కత నైట్ రైడర్స్. ఆరో ఓవర్ రెండో బంతికి సునీల్ నరైన్ కూడా పెవిలియన్ దారి పట్టాడు. యష్ దయాళ్ వేసిన ఓవర్ అది. ఆఫ్ స్టంప్స్‌కు కాస్త దూరంగా పడిన స్లోయర్ డెలివరీని లాంగ్ ఆన్ దిశగా భారీ షాట్ ఆడాడు నరైన్. తన తల మీదుగా దూసుకెళ్తోన్న బంతిని గాల్లోకి ఎగిరి అద్భుతంగా అందుకున్నాడు విరాట్ కోహ్లీ. అదే ఓవర్ చివరి బంతికి రఘువంశీ కూడా అవుట్ కావడంతో కేకేఆర్ వేగానికి కళ్లెం పడినట్టయింది.

Story first published: Sunday, April 21, 2024, 16:27 [IST]
Other articles published on Apr 21, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+