Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LSG vs KKR: లక్నోపై కోల్‌కతా చారిత్రక విజయం

కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. ఈడెన్‌ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 161 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (45; 32 బంతుల్లో, 2x4, 4x6), కేఎల్ రాహుల్ (39; 27 బంతుల్లో, 3x4, 2x6) రాణించారు. మిచెల్ స్టార్క్ (3/28) మూడు వికెట్లతో మెరిశాడు.

అనంతరం ఛేదనలో కోల్‌కతా నైట్ రైడర్స్ 15.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ (89*; 47 బంతుల్లో, 14x4, 3x6) అర్ధశతకంతో సత్తాచాటాడు. శ్రేయస్ అయ్యర్ (38*; 38 బంతుల్లో, 6x4) నిలకడగా ఆడాడు. కాగా, ఐపీఎల్‌ చరిత్రలో లక్నోపై కేకేఆర్‌కు ఇదే తొలి విజయం. అంతకుముందు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో లక్నో చేతిలో కేకేఆర్ ఓడింది.

IPL 2024 KKR register their first win over LSG in IPL

అయితే ఛేదనలో కేకేఆర్‌కు శుభారంభం దక్కలేదు. 42 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. సునీల్ నరైన్ (6; 6 బంతుల్లో)ను, రఘువంశీ (7; 6 బంతుల్లో)ను మోహ్సిన్ ఖాన్ తన వరుస ఓవర్లలో ఔట్ చేశాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్‌తో కలిసి ఫిలిప్ సాల్ట్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఆదిలో శ్రేయస్ ఆచితూచి ఆడినా ఫిలిప్ దూకుడుగా పరుగులు సాధించాడు. దీంతో కోల్‌కతా పవర్‌ప్లేలో 58 పరుగులు చేసింది.

అరంగేట్ర బౌలర్ షామర్ జోసెఫ్ తొలి ఓవర్‌లో ఏకంగా 22 పరుగులు సమర్పించుకున్నాడు. కుదురుకున్న తర్వాత శ్రేయస్ కూడా గేర్ మార్చడంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. మరోవైపు సాల్ట్ కూడా బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తించాడు. 26 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో ఫిలిప్ సాల్ట్ బౌండరీ బాది జట్టును విజయతీరాలకు చేర్చాడు.

మెరిసిన పూరన్
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్‌కు శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్‌ను రెండు వరుస బౌండరీలతో ఆరంభించిన డికాక్‌ (10; 8 బంతుల్లో, 2x4)ను రెండో ఓవర్‌‌లో ఔటయ్యాడు. వైభవ్ అరోరా బౌలింగ్‌లో నరైన్ చేతికి చిక్కాడు. విఫలమవుతున్న దేవదత్ పడిక్కల్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన దీపక్ హుడా (8, 10 బంతుల్లో, 1x4) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. స్టార్క్ బౌలింగ్‌లో రమణ్‌దీప్ స్టన్నింగ్ క్యాచ్ ఫలితంగా వెనుదిరిగాడు.

వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో కెప్టెన్ కేఎల్ రాహుల్ (39; 27 బంతుల్లో, 3x4, 2x6) దూకుడుగా ఆడటంతో లక్నో పవర్‌ప్లేలో 49 పరుగులు చేసింది. ఆయుష్ బదోని‌తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. మూడో వికెట్‌కు 39 పరుగులు జోడించాడు. కానీ వీరిద్దరు నిలకడగా బ్యాటింగ్ చేయడంతో లక్నో రన్‌రేట్ క్రమంగా తగ్గింది. అయితే కుదురుకున్న రాహుల్‌ను రసెల్ బోల్తాకొట్టించాడు.

ఆ తర్వాత స్టొయినిస్ (10; 5 బంతుల్లో), ఆయుష్ పెవిలియన్‌కు చేరారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కృనాల్ పాండ్య (7; 8 బంతుల్లో)తో కలిసి పూరన్ స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. కానీ కేకేఆర్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఓ దశలో లక్నో 17 ఓవర్లకు 126 పరుగులే చేసింది. కానీ ఆఖర్లో పూరన్ చెలరేగడంతో లక్నో 161 పరుగులు చేసింది. కేకేఆర్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు, వైభవ్, నరైన్, వరుణ్ చక్రవర్తి, రసెల్ తలో వికెట్ తీశారు.

Story first published: Sunday, April 14, 2024, 19:18 [IST]
Other articles published on Apr 14, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+