Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR vs SRH: మయాంక్ అగర్వాల్‌కు ఫ్లయింగ్ కిస్ ఇచ్చినందుకు హర్షిత్ రానాకు 60శాతం జరిమానా (Video) - BCCI

కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ నాలుగు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈడెన్‌‌గార్డెన్స్‌లో శనివారం జరిగిన ఈ పోరులో పరుగుల వరద పారింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది.

రసెల్ (64; 25 బంతుల్లో) విధ్వంసం సృష్టించాడు. మూడు ఫోర్లు, ఏడు సిక్సర్లు బాదాడు. సాల్ట్ (54; 40 బంతుల్లో) అర్ధశతకం సాధించాడు. రింకూ సింగ్ (23; 15 బంతుల్లో) ఫర్వాలేదనిపించాడు. అయితే ఓ దశలో కోల్‌కతా 14 ఓవర్లకు 119/6 స్కోరు మాత్రమే సాధించింది. కానీ ఆ తర్వాత రసెల్ తన ఊచకోతతో ఇన్నింగ్స్ స్వరూపాన్ని మార్చాడు.

IPL 2024 KKR hero Harshit Rana fined for excessive celebrations after taking Mayank Agarwal and Heinrich Klaasen wickets

అనంతరం ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 204 పరుగులే చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (63; 29 బంతుల్లో) గొప్ప పోరాటం వృథాగా మారింది. క్లాసెన్ ఎనిమిది సిక్సర్లు బాదాడు. అయితే ఆఖరి ఓవర్ వేసిన హర్షిత్ రాణా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి హైదరాబాద్ విజయాన్ని అడ్డుకున్నాడు. చివరి ఓవర్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌కు 13 పరుగులు అవసరమవ్వగా తొలి బంతిని క్లాసెన్ సిక్సర్ బాదాడు. కానీ ఆ తర్వాతి అయిదు బంతుల్లో హర్షిత్ రెండు పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.

కాగా, మ్యాచ్‌లో హర్షిత్ రాణా ఓవరాక్షన్ చేశాడు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (32; 21 బంతుల్లో)ను, హెన్రిచ్ క్లాసెన్‌ను ఔట్ చేసిన సమయంలో హర్షిత్ అతిగా ప్రవర్తించాడు. మయాంక్‌కు దగ్గరగా వచ్చి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాడు. క్లాసెన్ వెళ్లే అప్పుడు కూడా ఆవేశంగా బయటికి వెళ్లు అంటూ వేలు చూపించాడు. దీంతో మ్యాచ్ రిఫరీ హర్షిత్ రాణాపై కొరడా ఝుళిపించారు. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కారణంగా అతని మ్యాచ్ ఫీజులో 60శాతం కోత విధించారు. ఆర్టికల్ 2.5 ప్రకారం హర్షత్ రెండు లెవల్-1 నేరాలకు పాల్పడ్డాడని, ఈ నేపథ్యంలో అతనిపై మ్యాచ్ ఫీజులో 10%,50% జరిమానా విధించినట్లు తెలిపారు.

Story first published: Sunday, March 24, 2024, 10:46 [IST]
Other articles published on Mar 24, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+