ఉప్పల్ వేదికగా జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్‌ను క్రికెట్ అభిమానులకు ఎప్పటికీ మరిచిపోలేరు. ఈ పోరు ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ అందించింది. మ్యాచ్‌లో తొలి బంతి నుంచి ఆఖరి వరకు ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో వినోదంతో పాటు రికార్డులు నమోదయ్యాయి. ఐపీఎల్‌లో కొత్త చరిత్ర లిఖించబడింది.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక టీమ్ స్కోరు (SRH 277/3), అత్యధిక ఛేజింగ్ స్కోరు (MI 246/5), అత్యధిక సిక్సర్ల (38) సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. అంతేగాక టీ20 క్రికెట్‌లోనే అత్యధిక పరుగులు (523) నమోదైన మ్యాచ్‌గా ఈ పోరు నిలిచింది. ఇక SRH తరఫున కూడా ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. అత్యంత వేగంగా అర్ధశతకం సాధించిన సన్‌రైజర్స్ బ్యాటర్‌గా అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు.

523 పరుగులు నమోదైన ఈ మ్యాచ్‌లో అంతిమంగా ముంబైపై హైదరాబాద్ 31 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 277 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (62; 24 బంతుల్లో), అభిషేక్ శర్మ (63; 23 బంతుల్లో), మార్క్‌రమ్ (42*; 28 బంతుల్లో), క్లాసెన్ (80*; 34 బంతుల్లో) సత్తాచాటారు. అనంతరం ఛేదనలో ముంబై 20 ఓవర్లకు అయిదు వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది. తిలక్ వర్మ (64; 34 బంతుల్లో), టిమ్ డేవిడ్ (42*; 22 బంతుల్లో), ఇషాన్ కిషన్ (34; 13 బంతుల్లో) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ రికార్డు స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించిన క్లాసెన్‌కు ఫ్రాంచైజీ ప్రత్యేక బహుమతి ఇచ్చింది. గోల్డ్ కలర్‌లో ఉన్న భారీ మెడల్‌తో సత్కరించింది. అయితే దీనిపై నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. 'కోకాపేట క్లాసెన్‌ను సన్‌రైజర్స్ సీఈవో కావ్య మారన్ బహుమతిగా ఇచ్చింది' అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నాడు.
కాగా, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆరెంజ్ ఆర్మీ అనుబంధం గురించి క్లాసెన్ మాట్లాడాడు.'నా గడ్డం ఆరెంజ్,నా షూ కూడా ఆరెంజ్, అంతేగాక నాకు ఆరెంజ్ అంటే చాలా ఇష్టం' అంటూ SRH అభిమానులను ఉద్దేశిస్తూ క్లాసెన్ పేర్కొన్నాడు. కాగా, ఆదివారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో హైదరాబాద్ తలపడనుంది. సాయంత్రం 3.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.