ముంబై ఇండియన్స్ ఎంట్రీతో దేశంలో అసలైన ఐపీఎల్ హీట్ మొదలైంది. ముంబై కెప్టెన్సీ మార్పు అనంతరం మైదానంలో హార్దిక్ పాండ్యకు రోహిత్ శర్మ మద్దతు ఇస్తాడా అనే ప్రశ్నలు నిన్నటి వరకు వెంటాడాయి. కానీ గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వాటన్నింటికి సమాధానం దొరికాయి.
బౌండరీ లైన్ వద్ద రోహిత్‌ను ఫీల్డింగ్‌కు పంపడం, బుమ్రాకు ఆలస్యంగా బంతిని అందించడం మినహా హార్దిక్‌పై ఎలాంటి విమర్శలు రాలేదు. మొత్తంగా ముంబై శిబిరంలో పెద్దగా అంతర్గత విభేదాలు లేనట్లు కనిపించింది. అయితే రోహిత్-హార్దిక్‌పై అందరూ ఆసక్తి చూపడంతో ఇషాన్ కిషాన్ గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.

మానసిక అలసట కారణంగా దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్ధంతరంగా స్వదేశానికి వచ్చిన ఇషాన్ కిషాన్ ఆదివారమే పోటీక్రికెట్‌లో రీఎంట్రీ ఇచ్చాడు. టీమిండియాలో చోటు కోల్పోవడం, బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకోకపోవడం వంటి ప్రతికూలతల మధ్య ఇషాన్ పునరాగమనం చేశాడు. అయితే ఓపెనర్ బరిలోకి దిగిన ఇషాన్ నాలుగు బంతులు ఎదుర్కొని డకౌట్ అయ్యాడు. అజ్మతుల్లా బౌలింగ్‌లో వికెట్ కీపర్ సాహాకి క్యాచ్ ఇచ్చాడు.
రీఎంట్రీలో సత్తాచాటుతాడనుకుంటే ఇషాన్ కిషన్ నిరాశపరిచాడు. అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం ఇషాన్ కిషన్‌తో బీసీసీఐ సెక్రటరీ జై షా చాలా సేపు మాట్లాడాడు. ఇషాన్ ఆరోగ్య పరిస్థితి గురించి జైషా అడిగినట్లు తెలుస్తోంది. సెంట్రల్ కాంట్రాక్ట్‌లో చోటు కోల్పోయిన తర్వాత జైషాను ఇషాన్ కలవడం ఇదే తొలిసారి. దీంతో వాళ్ల సంభాషణ ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు జై షా- ఇషాన్ కిషన్ మాట్లాడుకోవడంపై మీమ్స్ వస్తున్నాయి. 'తానే సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించి ఇషాన్‌ను జైషా ఓదారుస్తున్నాడు, హ్యాపీగా ఉన్నాడో లేదో ఇషాన్‌ను జైషా ఆరా తీస్తున్నాడు, మరికొన్ని రోజుల్లో సెంట్రల్ కాంట్రాక్ట్ ఇప్పిస్తా అని హామీ ఇచ్చినట్లు ఉన్నాడు..' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, అహ్మదాబాద్ వేదికగా ఆదివారం రాత్రి గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆరు పరుగుల తేడాతో ఓటమిపాలైంది.