Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Jasprit Bumrah: ముంబై కెప్టెన్సీపై వార్తలు.. బుమ్రా క్రిప్టిక్ పోస్ట్ వైరల్!

Mumbai Indians: టీమిండియా ఏస్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తాజాగా చేసిన క్రిప్టిక్ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. గతేడాది గాయంతో ఆటకు దూరమైన అతను.. చాలా కాలం పాటు క్రికెట్ ఆడలేదు. అయితే రీఎంట్రీలో అద్భుతంగా ఆడుతూ ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది ఐపీఎల్‌లో అతని ప్రదర్శన కోసం ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు.

ఇలాంటి సమయంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలో రాజకీయాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్ సారధి హార్దిక్ పాండ్యాను ముంబై ట్రేడింగ్ ద్వారా తమ జట్టులోకి తెచ్చుకుంది. రోహిత్ తర్వాత జట్టు పగ్గాలను అతనికి అందించాలనే ఆలోచనతోనే పాండ్యాను ముంబై కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

 IPL 2024 Jasprit Bumrah cryptic post goes viral amid MI captaincy row

ఈ క్రమంలో బుమ్రాకు కోపం వచ్చిందని, అతను తర్వాత కెప్టెన్ అవుదామని అనుకుంటున్నాడని కొందరు అన్నారు. రోహిత్ తర్వాత బుమ్రాకు ముంబై ఇండియన్స్ పగ్గాలు అందుతాయని చాలామంది అనుకున్నారు. కానీ ఇప్పుడు సడెన్‌గా పాండ్యా రీఎంట్రీతో ఈ ఈక్వేషన్స్ మారిపోయాయి. ఇది బుమ్రాను అప్‌సెట్ చేసిందని కొందరు వాదిస్తున్నారు.

అందుకే తను ముంబై ఫ్రాంచైజీని వదిలేసి వేరే టీంతో కలవాలని బుమ్రా అనుకుంటున్నట్లు పలు వార్తలు వచ్చాయి. వీటిపై ముంబై ఫ్రాంచైజీ కానీ, బుమ్రా కానీ స్పందించలేదు. ఇలాంటి సమయంలో తాజాగా సోషల్ మీడియా వేదికగా బుమ్రా చేసిన పోస్టు వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రాం స్టోరీలో 'ఒక్కోసారి మౌనమే సరైన సమాధానం' అని బుమ్రా పోస్టు పెట్టాడు.

అతను ఇప్పుడు వస్తున్న వార్తలపై ఇలా స్పందించాడా? లేక ముంబై ఇండియన్స్‌లో పరిణామాలపై ఇలా రియాక్ట్ అయ్యాడా? అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఫ్యాన్స్ మాత్రం ముంబైకి భవిష్యత్తులో బుమ్రానే కెప్టెన్‌గా చూడాలని అనుకుంటున్నట్లు చెప్తున్నారు. ఇప్పుడు పాండ్యా రావడంతో ఆ ఆశలన్నీ ఆవిరైపోయాయని అంటున్నారు. మరి ఫ్యూచర్‌లో ముంబై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

Story first published: Tuesday, November 28, 2023, 18:16 [IST]
Other articles published on Nov 28, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+