శ్రీలంకకు బ్యాడ్ న్యూస్ & సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్ న్యూస్. లంక స్టార్ ప్లేయర్, ఎస్‌ఆర్‌హెచ్ నయా ఆల్‌రౌండర్ వానిందు హసరంగపై ఐసీసీ సస్పెన్షన్ విధించింది. అయితే హసరంగపై నిషేధం విధిస్తే సన్‌రైజర్స్‌కు శుభవార్త ఎలా అవుతుందని అనుకుంటున్నారా? దానికో కారణం ఉంది.
అసలేం జరిగిందంటే.. బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో పాల్గొనకుండా హసరంగపై ఐసీసీ నిషేధం విధించింది. ఇటీల బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి వన్డేలో అంపైర్ నిర్ణయంపై హసరంగ కాస్త దురుసగా నిరసన తెలిపినందుకు ఐసీసీ ఈ చర్యలు తీసుకుంది. తన టోపీని అంపైర్ నుంచి బలవంతంగా లాక్కున్నాడు.

దీనిపై సీరియస్ అయిన ఐసీసీ హసరంగ మ్యాచ్ ఫీజులో 50% జరిమానా విధించింది. అంతేగాక మూడు అయోగ్యత పాయింట్లు ఇచ్చింది. దీంతో గత 24 నెలల్లో అతడి ఖాతాలో డీమెరిట్ పాయింట్లు ఎనిమిదికి చేరాయి. ఐసీసీ నిబంధనల్లో ఆర్టికల్ 7.6 ప్రకారం ఆ డీమెరిట్ పాయింట్లు నాలుగు సస్పెన్షన్ పాయింట్లుగా మారుతాయి. ఈ కారణంగా అతడు రెండు టెస్టులు లేదా నాలుగు వన్డేలు లేదా నాలుగు టీ20 మ్యాచ్‌లకు నిషేధాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న బంగ్లా టెస్టు సిరీస్‌కు అతడు దూరమయ్యాడు.
గతేడాది మార్చిలోనే హసరంగ టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చాడు. కానీ మనసు మార్చుకుని రెడ్ బాల్ క్రికెట్‌కు అందుబాటులో ఉంటానని తెలిపాడు. దీంతో బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌కు అతడిని శ్రీలంక బోర్డు సెలక్ట్ చేసింది. ఈ రెండు టెస్టుల సిరీస్ మార్చి 22 నుంచి ఏప్రిల్ 3వ వరకు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లకు హసరంగ దూరమవుతాడని SRH మేనేజ్మెంట్‌తో పాటు అభిమానులు భావించారు. కానీ ఐసీసీ నిషేధంతో హసరంగ లీగ్‌లోని అన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండనున్నాడు. దీంతో సన్‌రైజర్స్ ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు.ఆర్సీబీ వదులుకోవడంతో వేలానికి వచ్చిన హసరంగ కోసం సన్‌రైజర్స్ రూ.1.50 కోట్లు ఖర్చు పెట్టిన విషయం తెలిసిందే.
సన్‌రైజర్స్ హైదరాబాద్: ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), ఎయిడెన్ మార్క్‌రమ్, అబ్దుల్ సమద్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, హెన్రిచ్ క్లాసెన్, మయాంక్ అగర్వాల్, అన్మోల్‌ప్రీత్ సింగ్, ఉపేంద్ర యాదవ్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్ (ట్రేడ్), అభిషేక్ శర్మ, మార్కో జేన్సన్, వాషింగ్టన్ సుందర్, సాన్‌విర్‌సింగ్ , భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్, ఫజహక్ ఫరూఖీ, ట్రావిస్ హెడ్, వానిందు హసరంగ, జయదేవ్ ఉనద్కత్, ఆకాశ్ మహరాజ్ సింగ్, జాతవేద్ సుబ్రమణ్యన్.